కందుకూరు సభలో మృతులకు తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం

Spread the love

నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఏడుగురు దుర్మరణం చెందడం విషాదకరమని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులకు ఆయన సంతాపం ప్రకటించారు. మృతుల ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబాలకు దేవుడు మనోధైర్యం కల్పించాలని, తెలుగుదేశం శ్రేణులు వారికి అనివిధాలా అండగా నిలబడాలని కోరారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో పాటుగా ఇతర అన్నివిధాలా ఆదుకుంటామని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.=

Leave a Reply