– ఆఫ్రికా ఖండానికి విస్తరించిన తెలుగువారి ఆందోళనలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా దేశ విదేశాల్లో ఆందోళన కార్యక్రమాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, న్యూజిలాండ్, సింగపూర్, టర్కీ దేశాలలో తెలుగువారు నిరసన గళం విప్పారు. తాజాగా నిరసన స్వరాలు ఆఫ్రికా ఖండానికి విస్తరించటం విశేషం. టాంజానియా ఆర్ధిక రాజధాని దార్ ఎస్ సలాంలో తెలుగువారు బాబు అరెస్టును ఖండిస్తూ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు కువైట్ , బహ్రైన్ దేశాల్లోనూ తెలుగువారు టీడీపీ జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
బెహరైన్ దేశంలోని మనామా సిటీలో ఐయామ్ విత్ బాబు నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసన ప్రదర్శన కోసం స్థానిక తెలుగువారంతా ఒకే వేదికపైకి రావడం విశేషం. ఎన్నారై టిడిపి కువైట్ -జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్” అనే కార్యక్రమాన్ని ఫర్వానియా లో ఉన్న ద్వైహి ప్యాలస్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు.