Suryaa.co.in

Andhra Pradesh

జాబు రావాలంటే జగన్ దిగిపోవాలి

– తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
– ఉద్యోగాల కోసం తెలుగుయువత వినూత్న నిరసన

గుంటూరు : నూతన జాబ్ క్యాలెండరుతో ఖాళీ పోస్టులో భర్తీ చేసేవరకు మెగా డి ఎస్సి లు పెట్టేవరకు తెలుగుయువత పోరాటం ఆగదు : జాబురావాలంటే జగన్ దిగిపోవాలి అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాను అని చెప్పి నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిన విధానాన్ని వివరిస్తూ ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు నేతృత్వంలో ముఖ్యఅతిధిగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి యార్డ్ లో కూలిపని కోసం వచ్చామంటూ హమాలీల వేషంలో వినూత్న నిరసన కార్యక్రమం చేసి ఆందోళ నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు బాబు మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో దావోస్ పేరుతో పెట్టుబడులు తీసుకువస్తాం అవకాశాలు తీసుకొస్తామని తెలిపిన ముఖ్యమంత్రి ముఖం చాటేశారని సమాచార హక్కుyuva2 ద్వారా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాలేదని తేలిపోవటంతో, జగన్ రెడ్డి మోసపూరిత నిర్లక్య వైఖరి స్పష్టం అయిందని నిరుద్యోగుల పక్షాన తెలుగుయువత అండగా నిలిచి పోరాటం చేస్తామని అందులో భాగంగానే నేడు గుంటూరులో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు వద్ద ఉద్యోగాలు లేక ఉపాధి కోసం యువత తో కలిసి కూలి పని దొరుకుతుందేమో అని ఉద్దేశంతో హామీలీల వేషధారణలో ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నామని అన్నారు.

వెంటనే జగన్మోహన్ రెడ్డి ఖాళీ పోస్టులు భర్తీ చేసి, ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకపోతే వెంటనే పెద్దఎత్తున ఆందోళ తో అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు. రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాబు రావాలంటే బాబు పోవాలని దుష్ప్రచారం చేసి నిరీద్యోగులకు ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని యువతyuva1 ఓట్లు దండుకున్న జగన్ మోహన్ రెడ్డి, గత మూడేళ్ళుగా మాట దాటవేస్తూ నేతి బీరకాయలో లో నెయ్యి చందంగా ఫేక్ జాబు క్యాలెండరు విడుదలచేసి, మెగా డిఎస్సికి మంగళం పాడి నిరుద్యోగులను మోసం చేసారని వెంటనే మనసు మార్చుకొని రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చెయ్యాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఈ రోజు నిరుద్యోగ లోకం జాబు రావాలంటే జగన్ దిగిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టి ఎన్ టి యూ సి అధ్యక్షుడు సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి ,మిర్చియార్డు కార్మిక సంగం అధ్యక్షులు టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు దొంత నాగ్ గౌడ్ , తెలుగుయువత రాష్ట్ర నాయకులు పుట్టి చంద్రశేఖర్ , దియ్య రామకృష్ణ ప్రసాద్ ,యల్లవుల అశోక్, షేక్ ఫిరోజ్ , పులుకూరి వెంకట్రావు, పోపూరి నరేంద్ర, పాలడుగు ప్రణీత్ ,పెద్ది విక్రమ్ , జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా , ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ ,కొల్లిమర్ల రాము , కొండెపు శేఖర్ బాబు,అధికార ప్రతినిధులు షేక్ షుకూర్,సింగంశెట్టి శివకుమార్ ,బాజీ వెంకట్రావు,ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు ,కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ రషీద్, మన్నెం శ్రీనివాసరావు,కార్యదర్సులు ఈదర త్రినాద్, మాచవరపు దాసు, ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిది మంచోడు మణి, రాష్ట్ర కార్యదర్శి పంచుమర్తి శేషు, నాయకులు బండి శివకేశవ, చేబ్రోలు కిరణ్,ప్రత్తిపాడు,తాడికొండ,గుంటూరు తూర్పు ,పశ్చిమ తెలుగుయువత అధ్యక్షులు నాగిశెట్టి నాగరాజు, చిగురుపాటి అనూప్,షేక్ అఫ్రోజ్ ,ఉప్పల రామారావు,మేడికొండూరు,గుంటూరు రురల్ మండల తెలుగుయువత అధ్యక్షులు మానుకొండ బ్రమ్మజి, యదాల గణేష్, మస్తాన్ రావణ్ ,గాలి శ్రీనివాస్ గౌడ్, ఘంటా సాంబ, పాస్టర్ అనిల్,అవినాష్, బుల్లా కుమార్ బాబు, కళ్యాణ్ , అశోక్ , నాని యువత విద్యార్థి జిల్లా , నియోజకవర్గ కమిటీ సభ్యులు యువత పాల్గొన్నారు.

LEAVE A RESPONSE