Suryaa.co.in

Andhra Pradesh

దళితుల ఆత్మగౌరవం నిలిపేది తెలుగు దేశం మాత్రమే

– చంద్రబాబు నాయుడు

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను.భవిష్యత్ తరాల కోసం, బడుగు జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పని చేయాలి.వ్యవస్థలపై దాడులు జరుగుతుంటే మళ్లీ వాటిని రక్షించేది కూడా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే.ఆ మహాశయుని జీవితాన్ని రేపటి తరాలు అధ్యయనం చేయాలన్న ఆలోచనతోనే ప్రజా రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతివనానికి టిడిపి హాయాంలో శ్రీకారం చుట్టాం.దళితుల ఆత్మగౌరవం నిలిపేది….వారి జీవితాల్లో వెలుగులు నింపేది తెలుగు దేశం మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న సమ సమాజ స్థాపనకు పునరంకితం అవుదాం.

LEAVE A RESPONSE