Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి నిర్మాణానికి డిసెంబర్ లో టెండర్లు

అమరావతి: రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం మూడు ముక్కలాటలాడింది.. రాజధాని నిర్మాణం కోసం కొన్ని కమిటీలు వేశాం.. ఈ నెలాఖరు లోపల ఆ కమిటీలు రిపోర్ట్స్ ఇస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో ఏమన్నారంటే… వాటిని సీఆర్డీఏ అథారిటీలో, క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ తీసుకుంటాం. వచ్చే నెల 15కి ఈ ప్రాసెస్ అంతా ముగిస్తుంది. డిసెంబర్ 31 నాటికి ఒకటి, రెండు మినహా అన్ని టెండర్లు పిలుస్తాం.

జనవరి నుండి అన్ని నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. రోడ్లు, బిల్డింగ్స్ డిజైన్స్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడం లేదు. అమరావతి డిజైన్స్ నిర్మాణాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిపుణులను అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తాం. జనవరి నుండి పూర్తిస్థాయిలో అన్ని టెండర్స్ ఖరారు చేసి, పనులు ప్రారంభిస్తాం.

LEAVE A RESPONSE