Suryaa.co.in

Telangana

శ్రీశైలం హైడల్ జెన్కో నాలుగో యూనిట్ పనులకు టెండర్లు

-రెండు కోట్లు ఖర్చు పెట్టే నిర్ణయం కోసం 60 కోట్లు పోగొట్టుకోవడం అర్థం లేని పని
-స్వీపర్ నుంచి సి ఈ వరకు ఒక కుటుంబం.. అందరం కలిసి సంపద సృష్టిద్దాం
-ఏ సమస్య వచ్చినా వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుంది
-శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ జెన్కో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

శ్రీశైలం: షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో మరమ్మతుకు గురైన యూనిట్ 4 పనులకు త్వరితగతిన టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం , విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు జెన్కో అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడెల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టులో పర్యటించి మంత్రి జూపల్లి, ఇంధన శాఖ సిఎండి ఎస్ .ఏ. ఎం.రిజ్వీ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఒక సీజన్లో మూడు నెలల్లో 60 కోట్ల విలువైన విద్యుత్తును ఇక్కడ ఉత్పత్తి చేస్తాం. రెండు కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మరమ్మతు పనుల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో జాతీయ మూలంగా 60 కోట్ల విలువైన విద్యుత్తును కోల్పోవడం అర్థం లేని పని అని డిప్యూటీ సీఎం తెలిపారు భట్టి విక్రమార్క అన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడెల్ జెన్కో ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణమైంది అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికంగా ప్రసిద్ధిగాంచిన హిటాచి సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించింది అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఈ ప్రాజెక్టులో ఉంది అన్నారు. ఈ ప్రాజెక్టులో చోటు చేసుకున్న 20 20 నాటి దుర్ఘటన అందరికీ బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. నాటి షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నుంచి యూనిట్ ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

బాధిత కుటుంబాలకు ఎప్పుడు ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మారిన కాలమాన పరిస్థితుల్లో ప్రతి పనికి, అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఆధారంగా ఉంది అని తెలిపారు. జెన్కో ప్రాజెక్టుకు సంబంధించి ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ఇక్కడ సాధించవచ్చు అని తెలిపారు. ఫలితంగా తక్కువ ధరలకే తెలంగాణ ప్రజలకు విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నారు.

గత ప్రమాదం నుంచి పని ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలకు సంబంధించి ఏం నేర్చుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అంగారక గ్రహం పై రాకెట్ పంపిస్తున్న సమయంలో, గుండు సూది కదిలిన కనిపించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పుడు ప్లాంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాటిని అధికారులు కనెక్ట్ చేసుకోవడం వంటివి చేపట్టాలన్నారు.

ప్లాంట్ లోకి వచ్చే ప్రతి మనిషికి చిన్న ఆక్సిజన్ సిలిండర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. భద్రతా చర్యల విషయంలో నిధులు సమస్య కాదు, మనిషి ప్రాణం విలువైనది, స్వీపర్ నుంచి సీఈ వరకు ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. ప్లాంట్లో భద్రతా చర్యలకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

టెయిల్‌పాండ్ తెగిపోయింది మరమ్మతులు చేయలేదని ఎమ్మెల్యేలు సమావేశంలో దృష్టికి తెచ్చారు, దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ లేఖలు ఇస్తే వెంటనే ఆ పనులు చేపడదామని డిప్యూటీ సీఎం అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, విద్యుత్ శాఖలో స్వీపర్ నుంచి సిఇ వరకు ఒక కుటుంబంలా పనిచేయాలని, అందరం కలిసి సంపాదన సృష్టించి ఆస్తులు పెంచాలని సూచించారు.

ఏ సమస్య వచ్చినా వినడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు.. ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు డి మోషన్స్ ఒంటి అంశాలు తన దృష్టికి వచ్చాయని ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, పరిణికా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE