-నిజనిర్ధారణ కమిటీ గృహ నిర్భంధం
-ఎక్కడికక్కడ నేతల హౌస్ అరెస్టులు
-బాధితులను పరామర్శించకుండా పోలీసులు అడ్డుకోవడంపై మండిపాటు
-ధన దాహంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం
బాపట్ల జిల్లా రేపల్లెలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో శుక్రవారం కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులపై అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనందబాబు, పర్చూరి అశోక్ బాబు, బుద్ధా వెంకన్న, పట్టాభిరామ్, ఆనం వెంకటరమణారెడ్డి ని పోలీసులు బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లేందుకు అనుమతించలేదు.
నేతలందరినీ అర్థరాత్రే హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడలో బుద్ధా వెంకన్న, పట్టాభి, అశోక్ బాబును పోలీసులు రేపల్లె వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం పోతుమేరక గ్రామంలో
నాంచారయ్య,రత్తయ్యలు జగన్ కల్తీ మద్యానికి బలైపోయారని, వారి కుటుంబాలను పరామర్శించి నిజనిర్ధారణ కోసం తాము బయలుదేరితే జగన్ రెడ్డి కి భయం దేనికని వారు ప్రశ్నించారు. నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద పోలీసుల హల్చల్ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆనం ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆనం ఇంటికి చేరుకున్నారు. అయినా వెంకటరమణారెడ్డిని పోలీసులు బయటకు అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో మాజీ నక్కా ఆనందబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిపాటి శ్రీనివాసరావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో కార్యకర్తలతో కలసి ఆనందబాబు ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం అర్ధరాత్రే అనగాని ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఉదయానికి కార్యకర్తలు అనగాని ఇంటి వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు.
దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు అనుతివ్వాలని సత్యప్రసాద్ కోరినప్పటికీ పోలీసులు అనుమంతిచలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సత్యప్రసాద్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టెర్రరిస్టు ఇంటికి వచ్చినట్లు పోలీసులు మోహరించారని, ఇది తన హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వెయ్యి మందిపై మానభంగాలు, దొంగతనాలు, మర్డర్లు జరిగాయని, వాళ్లను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు కానీ రేపల్లె ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడ్డుకునేందుకు మాత్రం పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు.
రేపల్లె లో మద్యం తాగి మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తుంటే, అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై న్యాయపోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ నిర్ణయం. ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించిన అనగాని
ప్రైవేటు కేసులు వేసి అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతానని వెల్లడి.