Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే శ్రీదేవి- ఎమ్మెల్సీ డొక్కా వర్గాల బాహాబాహి

-రచ్చకెక్కిన తాడికొండ వైసీపీ వర్గ పోరు
-ఎమ్యెల్యే శ్రీదేవి వర్గం-డొక్కా వర్గం పోటా పోటీ నిరసనలు
-ఇరు వర్గాలను అదుపు చేస్తున్న పోలీసులు
-డొక్కా గో బ్యాక్ అంటూ ఎమ్యెల్యే వర్గం నినాదాలు
-బ్రోకర్ వ్యవస్థ అంటూ ఎమ్మెల్యే వర్గం నినాదాలు
-వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తాడికొండ సొసైటీ యార్డ్ బైఠాయించిన ఎమ్యెల్యే వర్గం
-తాడికొండలో టెన్షన్.. టెన్షన్ 

తాడికొండ వైసీపీలో వర్గ పోరు ముదిరి ముదిరి రోడ్ ఎక్కింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గాలు బాహాబహే కి దిగారు ఇప్పటివరకు ప్రెస్మీట్లకు పరిమితమై విమర్శలుimage-5 చేసుకున్న ఇరువు వర్గాలు శనివారం రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలకు దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం తాడికొండలో బ్యానర్లు పెట్టుకొని గో బ్యాక్ సమన్వయకర్త డొక్కా అంటూ నినాదాలు చేశారు.

అధిష్టానం నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇదే సమయంలో డొక్కా వర్గం కూడా పోటీగా నిరసన ర్యాలీ కి దిగడంతో తాడికొండలో టెన్షన్ వాతావరణంimage-6నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక సీఐ జి. శ్రీనివాసరావు అదనపు బలగాలతో అప్రమత్తమై ఇరువు వర్గాలు ఎదురుపడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

బ్రోకర్ వ్యవస్థ నశించాలి.. వైసిపి పార్టీ జెండాను తిరిగి తాడికొండలో ఎగురువేయాలంటూ డొక్కా వర్గం నినాదాలు చేశారు.ఇలా గత పది రోజులుగా ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం ఎమ్మెల్సీ డొక్కా వర్గాల మధ్య పోరు జరుగుతుండడం రెండు రోజుల క్రితం తాడేపల్లి వద్ద కూడా శ్రీదేవి వర్గం నిరసన తెలియజేశారు. ఈimage-7 సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ అప్పి రెడ్డితో సమన్వయకర్త డొక్కా నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధినేత జగన్ వద్దకు తమ సమస్యను తెలియజేసి పరిష్కరించాలని అప్పటివరకు తమ ఆందోళన విరమించేది లేదని శ్రీదేవి వర్గం పట్టుబడుతుంది. ఇలా తాడికొండ వైసీపీలో రచ్చ నానాటికి ముదురుతుంది.

LEAVE A RESPONSE