Suryaa.co.in

Andhra Pradesh

థాంక్యూ ముఖ్యమంత్రి గారు..

– సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అంగన్ వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు..
– అంగన్ వాడీ వర్కర్లకు, సూపర్ వైజర్లకు ‘స్మార్ట్‌ ఫోన్’

రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్లకు పదోన్నతులు, పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్ వాడీ వర్కర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు
tq-cm1 ర్యాలీలు నిర్వహించారు.అలాగే ‘థాంక్యూ ముఖ్యమంత్రి గారు’ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, సూపర్వైజర్ల మేలు కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు.

స్త్రీ, శిశు సంక్షేమం, మహిళా సాధికారిత వైపు వేగంగా దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీ వర్కర్లకు రెండు తీపి కబుర్లను ఒకేసారి అందించింది. ఎనిమిదేళ్ల వీరి నిరీక్షణకు తెరదించి.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే, ప్రస్తుతమున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్‌ ఫోన్లు సైతం అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్‌ అనూరాధ రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీచేశారు.

రాష్ట్రంలో మంజూరైన మొత్తం గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులు 976 ఉన్నాయి. వాటిలో 416 పోస్టులను గతంలో భర్తీచేశారు. అంగన్ వాడీ వర్కర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా మిగిలిన పోస్టులను భర్తీచేస్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రేడ్–2 సూపర్వైజర్లకు గ్రేడ్–1 సూపర్వైజర్లుగాను, గ్రేడ్–1 సూపర్వైజర్లకు సీడీపీఓలుగాను, సీడీపీఓలకు ఏపీఓలుగాను పదోన్నతులు కల్పించారు.

ఇప్పుడు అంగన్ వాడీ వర్కర్లకు గ్రేడ్–2 సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న 560 విస్తరణాధికారులు (ఈఓ) గ్రేడ్‌–2 (సూపర్‌వైజర్లు) పోస్టులు వీరితో భర్తీకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 25 విడుదల చేసింది. అంగన్‌ వాడీ వర్కర్లకు 2019 ఎన్నికలకు 6 నెలల ముందుకు వరకూ ఉన్న జీతం రూ.7వేల రూపాయలు. దాన్ని జగనన్న ప్రభుత్వం రాగానే రూ.11,500కు పెంచింది.

అంగన్ వాడీ వర్కర్లకు, సూపర్ వైజర్లకు ‘స్మార్ట్‌ ఫోన్’
ఇక రాష్ట్రంలోని అంగన్ వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్ల చేతికి ప్రభుత్వం కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవ్వనుంది. రాష్ట్రంలోని 55,607 అంగన్ వాడీ వర్కర్లు, 1,377 వర్కింగ్ సూపర్‌వైజర్లకు కలిపి మొత్తం 56,984 స్మార్ట్‌ఫోన్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఒక్కో ఫోన్ ఖరీదు రూ.14,998 కాగా, మొత్తం రూ.85.47 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 24 విడుదల చేసింది.

LEAVE A RESPONSE