Suryaa.co.in

Andhra Pradesh

ఇదే స్ఫూర్తితో ఘనంగాఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు

ఛైర్మన్, ఎన్ టిఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ, మాజీ శాసనమండలి సభ్యులు టి.డి.జనార్థన్

ఎన్‌టిఆర్‌ పుస్తకావిష్కరణ సభ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు ‘శాసనసభ ప్రసంగాలు’, ‘చారిత్రక ప్రసంగాలు’ పుస్తకాల ఆవిష్కరణ సభ విజయవంతం కావడానికి అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన ఎన్‌టిఆర్‌ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు. సభ సజావుగా జరగడానికి సహకరించిన శ్రేయాస్‌ ఈవెంట్స్‌ అధినేత శ్రీనివాస్‌కు, మీడియాకి, వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థానికంగా సహకరించిన తెలుగుదేశంపార్టీ నాయకులు బోడే ప్రసాద్‌ గారికి, సభాస్థలం ఇచ్చిన అనుమోలు గార్డెన్స్‌ అనుమోలు ప్రభాకర్‌ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.

LEAVE A RESPONSE