– చంద్రబాబు కుటుంబానికి చేనేత పట్టు వస్త్రాలు బహూకరించిన తొగట వీర క్షత్రియులు
– తొగట వీర క్షత్రియుల కులదేవత చౌడేశ్వరి చిత్రంతో ఉన్న వస్త్రం లోకేష్‌కి అందజేత
– ధర్మవరం ప్రజలు ఆత్మీయత జీవితంలో మరిచిపోలేనన్న నారా లోకేష్
తెలుగుదేశం తేజం, టిడిపి యువనేత నారా లోకేష్‌కి నేతన్నలు అమూల్యమైన కానుకలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో ధర్మవరం చేరుకున్న నారా లోకేష్‌కి అపూర్వ స్వాగతం పలికారు. చేనేతల పురం ధర్మవరంలో నేతన్నలైన తొగటవీర క్షత్రియ సంఘం లోకేష్‌ని పట్టువస్త్రాలతో ఆత్మీయంగా సత్కరించారు. ధర్మవరం తనపై కురిపించిన అభిమానానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
నలభై ఏళ్లకి పైగా చేనేతలకి అండదండలు అందిస్తోన్న తెలుగుదేశం కుటుంబానికి పట్టు చీరలు, పంచెలు, కండువాలు పెట్టారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మనవడు దేవాన్ష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి కోసం చేతి మగ్గాలపై స్వచ్ఛమైన పట్టుతో నేసిన వస్త్రాలను బహూకరించారు. ధర్మవరం నేతన్నలు తమపై చూపించిన అభిమానానికి లోకేష్ ఆనందంతో పులకించిపోయారు.
తొగటవీర క్షత్రియుల కులదేవత నందవరం చౌడేశ్వరి అమ్మవారి చిత్రాన్ని పట్టుతో నేసి లోకేష్‌కి అందజేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా తమ ధర్మవరం నియోజకవర్గానికి యువనేత నారా లోకేష్ వస్తున్నారని తెలిసి చాలా రోజుల ముందు నుంచే చేతిమగ్గాలపై చీరలు, పంచెలు, కండువాలు నేసి సిద్ధం చేసుకున్నారు. తమ అభిమాన యువనేత లోకేష్ కి అందజేసి ఆనందం వ్యక్తం చేశారు తొగట వీర క్షత్రియ సంఘీయులు.