– మంత్రి చిత్రపటానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం క్షీరాభిషేకం
విజయవాడ : ఎన్నికల హామీలో భాగంగా మెగా డీఎస్సీ ఫైల్ మీద మొదటి సంతకం పెట్టడం… అంతే పారదర్శికంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించిందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం మంత్రి లోకేష్‌కు ధన్యవాదములు తెలిపింది. డీస్సీ – 2025 విజేతలు ఉద్యోగాలలోకి చేరబోతున్న శుభతరుణంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఈ మెగా డీఎస్సీ- 2025 విజయాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా థాంక్యూ లోకేష్ సార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా లోకేష్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. రాష్టంలో అత్యధికం గా డీఎస్సీల ద్వారా రెండున్నర లక్షల ఉపాధ్యాయ నియామకాలు చంద్రబాబు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్‌యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్, చెరుకూరి పూర్ణ చంద్రరావు, అర్రె బోయన రాంబాబు, షేక్ రహమాన్, యం. రవీంద్ర, మండ్ల శ్రీనివాసులు మందా ప్రసాద్, నాగినేని నాగేశ్వరరావు, రఘు, నల్లూరి నరసింహారావు, గుడివాడ శ్రీనివాస్, చుండూరి రఘు, తదితరులు పాల్గొన్నారు.