రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ )డిమాండ్
కాకినాడ: కాకినాడ జిల్లాకే ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ కాంస్య విగ్రహానికి 100 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన బ్రాందీ షాపును తక్షణమే తొలగించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) డిమాండ్ చేసింది.
సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కాకినాడ ముఖద్యారం ఇంద్రపాలెం లాకులు వద్ద ఉన్న ప్రతిష్టాత్మక అంబేద్కర్ కాంస్య విగ్రహం కు 100 మీటర్లు దూరంలో ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపును అక్కడ నుంచి వేరే చోటకు తరలించాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్పిఐ నేతలు అందించారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ మాట్లాడుతూ, గతంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేయడం జరిగిందని, ఈ సందర్భంగా 21 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. అంబేద్కర్ విగ్రహానికి 100 మీటర్ల దూరంలో బ్రాంది షాపు ఏర్పాటు చేయడం వల్ల, మద్యం సేవించిన మత్తులో ఎవరైనా అంబేద్కర్ విగ్రహానికి అపచారం తలపెట్టే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ బ్రాందీ షాప్ ను ఆనుకునే ఉపాధ్యాయ అసోసియేషన్ మందిరం ఉందన్నారు. యానం నుంచి సామర్లకోట వెళ్లే వాహనాలు ఆ షాపు ముందు మార్గం నుండే వెళ్లాలని ఆ మార్గం మందు బాబులతో తరచూ బ్లాక్ అవుతుందని ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆయన వివరించారు. మహనీయుని విగ్రహానికి ఆనుకుని ఏర్పాటుచేసిన బ్రాందీ షాపును వేరే చోటకి తరించుకోవాల్సింది గా షాపు యజమాన్యాన్ని ఆదేశించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శీలం వినోద్, బి.అప్పారావు, బీర విజయకుమార్, టి స్వప్న, పి.మంజు పాల్గొన్నారు.