– అంధకారాన్ని ఛేదించిన భరతమాత బిడ్డ గెలుపు కథ
కూతురు చనిపోయి ఉంటే బాగుండు అనుకున్నాడు తండ్రి… కానీ ఆ కూతురు ప్రపంచాన్ని గెలిచింది! అంధకారాన్ని ఛేదించిన భరతమాత బిడ్డ గెలుపు కథ! కళ్ళ ముందు చీకటి! కానీ, మనసులో మాత్రం ప్రపంచ కప్ గెలవాలనే మెరుపు కాంతి! చూపు లేని ఆ తల్లిదండ్రుల ప్రపంచంలో ఆ క్షణం కన్నీళ్లే నిండిపోయాయి.
ఆ తండ్రి మనసులోంచి వచ్చిన మాట ఇది:
“నా కూతురు చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది… కానీ, ఆ కూతురు WC గెలిచి నన్ను ఓడించింది!” — ప్రపంచ కప్ గెలిచిన అంధ క్రికెటర్ కరుణ కుమారి తండ్రి. ఏ తండ్రికి మాత్రం ఆ మాట అనాలని ఉంటుంది? ఆ నిస్సహాయతే ఆయన్ను అలా మాట్లాడేలా చేసింది. కానీ, ఆ కూతురు… పంగి కరుణ కుమారి! విశాఖ బిడ్డ, ఆ నిరాశను పటాపంచలు చేస్తూ, తన తండ్రినే కాదు, యావత్ ప్రపంచాన్ని గెలిచింది! శ్రీలంక వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో, మన భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు చరిత్ర లిఖించింది! నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి, దేశానికి తొలి వరల్డ్ కప్‌ను అందించారు. కరుణ కుమారి 42 పరుగులతో వీరవిహారం చేసింది. కరుణ కుమారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇప్పించి ప్రోత్సహించారు . ప్రపంచాన్ని జయించే ఆ అమ్మాయిని చనిపోయి ఉంటే బాగుండు అన్న తండ్రిని గర్వపడేలా చేసింది తన పట్టుదలతో.