జగన్ పాదయాత్ర చేస్తూ ఉంటే.. ఓ చిత్తూరు జిల్లా నాయకుడు రాత్రి విడిదికి తన ఇంటికి ఆహ్వానించాడు. ఆహ్వానం మన్నించి వచ్చిన జగనుకు ఘనస్వాగతం పలికి, మర్యాదలు చేసి వారి ఇంటి మేడ మీద బస ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు తన ఇంటి మేడ మీదకు యజమాని వెళ్ళాడు జగనుతో మాట్లాడానికి. జగన్ వ్యక్తిగత సిబ్బంది ఆ పెద్ద రెడ్డిని లోనికి రానివ్వలేదు. తన ఇంటి మేడ మీదే, తనకే జరిగిన పరాభవాన్ని తట్టుకోలేకపోయాడు. సౌండ్ పెంచాడు. అవతల జగన్ ఏ పరిస్థితిలో ఉన్నాడో లోనికి ఆయన సిబ్బంది లోనికి పంపలేదు. మా ఇంటికి వచ్చి xxx నన్నే కలవడా అని బిగ్గరగా బూతులు మొదలెట్టాడు.
అయినా అవతల నో ఎంట్రీ. ఇంటాయనకే చుట్టుప్రక్కల వాళ్ళు సర్దిచెప్పి ఓదార్చారు. * * * ఇవాళ పులివెందులలో ప్రజాదర్బార్ అని జన సమీకరణ చేశారు. ఎమ్మెల్యే షూటింగ్, గ్రాఫిక్స్ అయ్యింది. లోన బడా నాయకులను లైన్లో నిలబెట్టి సెల్ఫీలు తీసి పంపారు. అసెంబ్లీకి వెళ్లడు, ఏ సాయం అడిగినా మన ప్రభుత్వం రానీ అంటాడు కాబట్టి డిపాజిట్ గల్లంతు చేసిన పులివెందుల ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. బయటనుండి వచ్చిన వారు సెల్ఫీలు తీసుకుని వెళ్లారు.
వైకాపా అఫిషియల్ ఎఫ్ బి పేజీలో కూడా.. ప్రజాదర్బార్ ఇది అని పోస్టులు పెట్టలేదు.
* * *
చిత్రాలు : మొదటిది రాత్రి 8.45కు కూడా టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద లోపల ఉన్న వారిని కలిసి పంపడానికి లోకేశ్ ప్రజాదర్బార్ కొనసాగుతోంది. రెండోది సాయంత్రం బయట షూటింగ్ అయ్యాక, ప్రజాదర్బార్ అని పులివెందుల క్యాంప్ ఆఫీసులో జగన్ ఫోటోలు దిగుతున్నవి. ఆ ఆఫీసులోనే జడ్పీటీసీ ఎన్నికల రోజు అవినాశ్ లోపల గడ పెట్టుకొని, పోలీసులు డోర్ కొట్టినా ఓపెన్ చెయ్యకుండా బాత్రూములో దాక్కున్నది.
– చాకిరేవు

