Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా కావాలి

  • ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే 
  • ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి 
  • ఎమ్మెల్యే సత్యానందరావు

ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉండాలని అధికారులను ఉద్దేశించి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.ఆలమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజా దర్బార్ ను నిర్వహించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను సత్యానందరావు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రజా సమస్యలలో కొన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలతో ఆధారపడి ఉన్నాయని వాటికి కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.అధికారులు,ఉద్యోగులు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సత్యానందరావు సూచించారు.

ఈ కార్యక్రమంలో మెర్ల గోపాలస్వామి,వంటిపల్లి పాపారావు,వంటిపల్లి సతీష్,సలాది నాగేశ్వరావు, ఈదాల నల్లబాబు,సూరపరెడ్డి సత్య, అయినవిల్లి సత్తిబాబు, దండగి రామారావు,నాగిరెడ్డి వెంకటరావు,గుత్తుల సూర్యచంద్రరావు మరియు కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE