Suryaa.co.in

Telangana

జిల్లాను అని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

– కేబుల్ బ్రిడ్జితో మానేరు రివర్ ఫ్రంట్ కి సరికొత్త శోభ
– ప్రపంచ స్థాయి పర్యాటక నిర్మాణం మానేరు రివర్ ఫ్రంట్ పై మంత్రి గంగుల

కెసిఆర్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కరీంనగర్లోనే తొలిసారి పర్యటించారు
జీవో నెంబర్ 4తో నగర రూపురేఖలను మార్చారు.కరీంనగర్ ను ఆనుకొని ఉన్న 24 టీఎంసీల మానేరు జలాశయాన్ని… పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన గత పాలకులకు రాలేదు. మానేరు నది తీరాన్ని పర్యాటకగా కేంద్రంగా మార్చుతామని సీఎం కేసీఆర్ అంటే ఎంతోమంది వ్యంగ్యంగా నవ్వారు.

కానీ జరిగిన అభివృద్ధిని చూసి నాడు నవ్విన నోరులే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి.ఎవరు కితాబిస్తారని మేము పనిచేయడం లేదు.9 ఏళ్లలోనే కరీంనగర్ రూపురేఖలు మార్చి… హైదరాబాద్ తర్వాత రెండవ గొప్ప నగరంగా తీర్చిదిద్దాం.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కు సరికొత్త సొబగులు అద్దాలని ఇప్పుడు మేము సింగపూర్, సీయోల్… ఒస్సొలొ పర్యటిస్తున్నాం.

మానేరు రివర్ ఫ్రంట్ ను మొదటి దశలో 3.5 కిలోమీటర్లు గా… రెండవ దశలో 6.25 కిలోమీటర్లు గా మొత్తం 10 కిలోమీటర్లలో నిర్మిస్తున్నాం.ప్రపంచంలోనే కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ను అధునాతనంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయం.మానేరు రివర్ ఫ్రంట్ కు అడ్డంకి కాకుండా… ఆకర్షణీయంగా ఉండాలని కేబుల్ బ్రిడ్జిని నిర్మించాం.

కేబుల్ బ్రిడ్జితో మానేరు రివర్ ఫ్రంట్ కి సరికొత్త శోభ వచ్చింది. పర్యాటకంలో కేబుల్ బ్రిడ్జ్ 20% అయితే మానేరు రివర్ ఫ్రంట్ 80%.ఎం ఆర్ ఎఫ్ లో భాగంగా ఇప్పటికే బిగ్ ఓ ఫౌంటెన్ వర్క్ ప్రారంభమైంది.ప్రస్తుతం 410 కోట్లతో పనులు జరుగుతున్నాయి.ఇందులో 310 కోట్లు మానేరు రివర్ ఫ్రంట్ కైతే మరో 100 కోట్లు పర్యాటకానికి కేటాయించాం.డ్యాము నుండి పెద్ద ఎత్తున వరద వస్తే తట్టుకునే విధంగా ఆఫ్ చెక్ డ్యాం… ఆఫ్ బరాజ్ నిర్మిస్తున్నాం.

ఆగస్టులోగా మానేరు మొదటి దశ పనులను పూర్తి చేసి 12 అడుగుల లోతు ఉండేలా నీటిని నిలిపేస్తాం.పర్యాటకానికి కేటాయించిన 100 కోట్లలో 72 కోట్లతో బిగ్ ఓ ఫౌంటెన్ నిర్మిస్తున్నాం.మరో 10 కోట్లను స్పీడ్ బోట్లకు కేటాయించాం.ఇంకో 10 కోట్లతో ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎంట్రెన్స్ ప్లాజా నిర్మాణం… మట్టి పనులకు కేటాయించాం.

మానేరు రివర్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ మరో 250 కోట్లు కేటాయించారు.ఈ 250 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ లో పర్యాటకంగా ఎలాంటి ధీములు చేపట్టాలనే దానిపై ఓ డెలిగేషన్ బృందాన్ని… సిఎం కేసీఆర్ విదేశాలకు పంపిస్తున్నారు.ఈ డెలిగేషన్ బృందంలో ముగ్గురు రాజకీయ నాయకులు… ముగ్గురు అధికారులు ఉన్నారు.

రాజకీయ నాయకుల్లో నాతోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉంటే అధికార బృందంలో కరీంనగర్ కలెక్టర్ కర్ణణ్ , రజత్ కుమార్, పర్యాటకశాఖ ఎండి మనోహర్ రావు లు ఉంటారు.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక బృందం సింగపూర్ తో పాటు సౌత్ కొరియా… ఓసోలో పర్యటిస్తుంది.అక్కడి లేటెస్ట్ రివర్ ఫ్రంట్ లను అధ్యయనం చేసి అంతకంటే అడ్వాన్సుడ్ గా ఉండేలా మానేరు రివర్ ఫ్రంట్ ఉండాలన్నది మా లక్ష్యం.కరీంనగర్లో నిర్మిస్తున్న బిగ్ ఫౌంటెన్ ఒసో లోనే ఉంది.ఆ ఫౌంటెన్ను పరిశీలించి అంతకంటే అదునాతనమైన ఫౌంటెన్ను కరీంనగర్లో నిర్మించేలా అధ్యాయనం చేస్తాం.

ఓసో రివర్ ఫ్రంట్ లోని ఎలిమెంట్లను కరీంనగర్ తీసుకురావాలన్నదే మా ధ్యేయం.
సింగపూర్ లో అమెరికన్ టెక్నాలజీతో నిర్మించిన యూనివర్సల్ స్టూడియో ని అధ్యాయనం చేస్తాం.గుజరాత్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ కన్నా అధునాతనమైన మానేరు రివర్ ఫ్రంట్ ను నిర్మించడమే మా లక్ష్యం.ఈ ఎంఆర్ఎఫ్ తెలంగాణకి గర్వకారణంగా నిలువాలన్నది మా ధ్యేయం.విదేశీ పర్యటకులను సైతం ఆకర్షించే విధంగా కరీంనగర్కు గొప్ప ఆస్తిగా నిలిచే విధంగా ఈ రివర్ ఫ్రంట్ ను నిర్మిస్తున్నాం.

LEAVE A RESPONSE