– రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు
కాకినాడ: ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 19వ ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యాలయం ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి పర్యవేక్షణలో 19వ ప్రజా దర్బార్ జరిగింది. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించి మొత్తం 30 అర్జీలు స్వీకరించగా, వాటిలో అయిదు అర్జీలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ అర్జీలను అందిస్తున్నట్టు తెలిపారు. ఎంపీ కార్యాలయానికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనే ధీమాతో ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా సతీష్ బాబు ఏర్పాటు చేసిన టీం సభ్యులు పనిచేస్తున్నారన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా నిర్వహిస్తున్నారని వారు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జి, డి ఆర్ యు సి సి సభ్యులు అనిల్, కాకరపల్లి చలపతిరావు, కరప మాజీ ఎంపీపీ సీతామాలక్ష్మి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.