– ఎమ్మెల్యే కన్నా, కొమ్మాలపాటి శ్రీధర్
సత్తెనపల్లి: సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో స్త్రీ శక్తి పథకానికి సంబంధించి మహిళా సాధికారత విజయోత్సవ సభ జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళాభ్యుదయమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. ఆడబిడ్డలను, అక్కాచెల్లమ్మలను సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వారి కాళ్లపై వాళ్లు సొంతంగా వ్యాపారాలను చేసుకుని ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళా సాధికారత మహిళ స్వావలంబనను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.