Suryaa.co.in

Andhra Pradesh

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు అప్రజాస్వామికం

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు అప్రజాస్వామికం. హద్దులు మీరి వ్యవహరిస్తున్న వైసీపీ నేతలను కట్టడి చేయకుండా.. ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులు పెడుతున్నారు. తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసే అంత నేరం ఏం చేశారు? వేధింపులు, కక్ష సాధింపులే అజెండాగా పాలన కొనసాగిస్తున్న జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పేరోజులు త్వరలోనే ఉన్నాయి. ప్రజల అభివృద్ధి, సంక్షేమం గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. వైసీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చినా గంటల వ్యవధిలోనే 4 జిల్లాలు దాటి బండారు ఇంటిపై దాడి చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించరు? తాడేపల్లి డైరెక్షన్ లో అక్రమ కేసులు పెడుతున్న డీజీపీకి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రశ్నించే గొతులను తొక్కుతున్న జగన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓటుతో ప్రజలే తొక్కుతారు.

LEAVE A RESPONSE