– నవరత్న పథకాల ద్వారా ఇప్పటివరకు రూ1.30 లక్షల కోట్టు లబ్దిదారుల ఖాతాల్లో జమ
– ఉన్నత చదువులు ప్రతి పేద విద్యార్దికీ అందాలన్నదే సిఎం జగన్ లక్ష్యం
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
వైసీపీ మళ్లీ వస్తే ఎవరూ బతకలేరంటూ చంద్రబాబు, మరికొందరు స్వార్ధపరులు గింజుకుంటున్నారని, వైసీపీ ప్రభుత్వంలో దళారులు, లంచగొండులు, అక్రమార్కుల ఆటలు ఏమాత్రం సాగవన్నది ప్రజలెరిగిన సత్యమని రాజ్యసభ సభ్యలు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులకు ఇక మనుగడ ఉండదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సారద్యంలోని వైసిపి అధికారంలోకి రావాలన్నది కోట్లాదిప్రజల ఆకాంక్షని, ప్రజల ఆకాంక్షను ఎవ్వరూ తప్పించలేరని అన్నారు. సంక్షేమ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధిఫలాలు ఎల్లప్పుడూ అందుతూనే ఉంటాయని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నవరత్న పథకాల ద్వారా రూ.1.30 లక్షల కోట్ల నగదును నేరుగా పేదల ఖాతాల్లో జమచేశారని. లబ్ధిపొందిన వారిలో 47.93 శాతం బీసీలు, 16.30 శాతం ఎస్సీలు, 5.18 శాతం ఎస్టీలు, 3.91 శాతం మైనారిటీలు, 8.76 శాతం కాపులు ఉన్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ ఫలాలు అందించి రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని శ్రీకారం చుట్టిందని అన్నారు.
ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ఈ మేరకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించే విధంగా విద్యార్దుల కోసం వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలను రూపకల్పన చేసారని అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్థి చదువేనని, ఆ ఆస్థి ఎవరూ దొంగలించలేనదని, జీవన ప్రమాణాలను మార్చేశక్తి చదువుకు మాత్రమే ఉందని అన్నారు. అక్క చెల్లెమ్మలకు తాను ఎల్లవేళలా తోడుంటానని, ఎంత మంది పిల్లలుంటే అంత మందినీ చదివించాలని సీఎం జగన్ గారు పిలుపునిచ్చారని చెప్పారు.