-గుట్కా బ్యాచ్.. గుడివాడను మట్కా, జూదం, గంజాయికి అడ్డాగా మార్చింది
– కింజరాపు అచ్చెన్నాయుడు
గుడివాడ క్యాసినో నిర్వహణ గుట్టు విప్పేందుకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులపై వైసీపీ గుట్కా బ్యాచ్ దాడి చేయడం దుర్మార్గం. అసలు తప్పే జరగలేదు అని వాదిస్తున్నపుడు నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి.? గంజాయి బ్యాచ్ ను అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలపై హత్యా యత్నం చేశారు. కాసినో గుట్టు బయట పడుతుందనే భయంతోనే గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం చేస్తోంది. ఎందరో మహానుభావులు నడయాడిన గుడివాడను గుట్కా బ్యాచ్ మట్కాకు, వ్యసనాలకు కేంద్రం చేసింది. ఎన్.టీ.ఆర్. టూ వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పనికిమాలిన పనులు చేస్తూ.. ఎన్.టీ.ఆర్ పరువు తీస్తున్నాడు. క్యాసినో, జూదం, క్యాబరే డాన్స్ లు పెట్టి యువత జీవితాలు నాశనం చేస్తున్నారు.
కొడాలి నాని కోడె తాచులా స్థానిక యువతను నాశనం చేస్తున్నాడు. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని కొడాలి నాని గుడివాడను, స్థానిక యువతను నాశనం చేస్తున్నాడు. కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను వీడియోలు, సాక్ష్యాలతో సహా బయట పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మంత్రి నిస్సిగ్గుగా అక్కడేం జరగలేదు అంటూ బుకాయిస్తున్నాడు. బహిరంగంగా గుడివాడలో క్యాసినో, జూదం, క్యాబరే నడిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా.? లేదా క్యాసినో నుండి వచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి అన్నీ తెలిసీ నిద్ర నటిస్తున్నారా.? టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు పక్కనే ఉంది కూడా అడ్డుకొకపోవడం దుర్మార్గం. కాసెనో గుట్టు బయట పెట్టేందుకు వెళ్లిన టీడీపీ సభ్యులను అడ్డుకున్న పోలీసులకు అంత పబ్లిగ్గా దాడి చేస్తుంటే కనిపించలేదా.? టీడీపీ నేతలపై దాడి ఘటనలో మంత్రి కొడాలి నాని, వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కొడాలి నానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. కొడాలి నాని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచకాలు, పాపాలు ప్రజలు భరించే రోజులు పోయాయి. గుడివాడ క్యాసినో ఘటనలో చర్యలు తీసుకోకుంటే జగన్ రెడ్డి చీటీ చిరగడం ఖాయమని గుర్తుంచుకోవాలి.