– సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు జీజీహెచ్ లో పేదలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరం.ఆస్పత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణమనే ధోరణిలో మాట్లాడటం దురదృష్టకరం.పేదల ప్రాణాలంటే కలెక్టర్ కు లెక్కలేదా…మేజర్ ఇష్యూ జరిగితే పట్టుమని పది నిమిషాలు కూడా ఆస్పత్రిలో నిలబడలేరా?
ఇంతకంటే మీరు చేసే రాచకార్యాలు ఏమున్నాయి. పైకి పోయి కిందకు వచ్చి రెండు మాటలు చెప్పి వెళ్లిపోతారా..కేసుల వారీగా వివరాలు వెల్లడించలేరా?పేదలు ప్రాణాలు కోల్పోతే మీరు వాడుతున్న భాష ఏంటో మీకు అర్థమవుతుందా..కనీసం ఆ కుటుంబాలపై సానుభూతి కూడా చూపలేరా?
ప్రజల డబ్బుతో జీతాలు, వసతులు, వాహన సౌకర్యాలు పొందుతూ ఆ పేదల ప్రాణాలు కాపాడరా..వారిని కనీసం గౌరవించరా? పెద్దాసుపత్రిలో జరిగిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ జరపాలి..వాస్తవాలను ప్రజల ముందుంచాలి.