మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు సెక్రటరీ రఘునందన్ రావు, హెచ్ఓడీ, ఇతర అధికారులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా వృత్తి వ్యవసాయం. నేనున్న వృత్తికి సంబంధిన పోర్ట్ ఫోలియో నే నాకు కేటాయించడం సంతోషకరం.
సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పద్దతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక పంట దిగుబడిని సాధించడమే కాకుండా, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం విశేషంగా కృషి చేయాలి. తద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభించేలా మార్కెటింగ్ శాఖా అధికారులు కృషి చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం పంటలను రైతులకు పరిచయం చేయాలి.
వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి, ఆ పంటలను పండిచేందుకు వాళ్లను మానసికంగా సంసిద్ధం చేయాలి. మామిడి, జామ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆ పంటల సాగుకు సహాయపడాలి. పాం ఆయిల్ పంట సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. వాళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. ఆ సాగును మరింత ప్రోత్సహించాలి. అందులో అంతర పంటగా పుచ్చకాయలు పండించే విధంగా ప్రోత్సహించాలి. రైతు బాగు పడితే మిగిలిన అన్ని రంగాలు బాగు పడతాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉంటంది. రైతు బాగుండాలి అనేది నా ఆశయం అని తెలిపారు.
ముఖ్యమంత్రి ముందు చూపునకు అది నిదర్శనం. వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించడం వల్లే ఆయన నాకు ఈ శాఖను కేటాయించారు. అన్ని రకాల పంటలకు తెలంగాణా నేల అనుకూలంగా ఉంటుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రానికి ఈ ప్రత్యేకత లేదు. సీజన్ల వారిగా ముందుగానే శాఖల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకు తగ్గట్టుగా రైతులను వ్యవసాయానికి సమాయత్తం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి ఉత్పత్తి పెంచి వ్యవసాయశాఖకు మంచి పేరు తేవాలి. వ్యవస్థలో, శాఖాపరంగా ఉన్న లోపాలను సవరించుకొని రైతులకు సంక్షేమానికి అధికారగణం పాటుపడాలి అన్ని తెలిపారు.