Suryaa.co.in

Andhra Pradesh

టిటిడి అధికారుల తీరు హాస్యాస్పదం!

– రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి “టాక్సీ డ్రైవర్ల కడుపు కొట్టే” ఆలోచనను టీటీడీ ఉపసంహరించుకోవాలి!
తిరుపతి స్థానికుల జీవితాలతో టీటీడీ “దాగుడుమూతలు” ఆడటం సరదాగా మారింది!

ఇటీవల… తిరుపతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 22 A (పెద్దకాపు వీధి పరిసర ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ల నిలుపుదల చేస్తూ ఇచ్చిన) జీవోని అధికారికంగా టీటీడీ ప్రకటించడం, స్థానికుల పక్షాన తామంతా ప్రశ్నిస్తే వెంటనే గొప్ప మనస్సుతో ఉపసంహరించుకున్నట్లు “బిల్డ్ అప్” ఇవ్వడం స్థానికులు గమనిస్తున్నారు.

తిరుమల కొండకు టాక్సీలను నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న వేలాదిమంది శ్రీనివాసం,విష్ణునివాసం, అలిపిరి,కోనేటికట్ట వద్ద టాక్సీ స్టాండ్ లు ఏర్పాటు చేసుకొని భక్తులను తిరుమలతో పాటు జిల్లాలోని ఆలయాల సందర్శనకు తీసుకెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు అలాంటి వారి కడుపు కొట్టే విధంగా 15 సంవత్సరాల పైబడిన టాక్సీలను తిరుమల కొండకు అనుమతించం అనే ఆలోచన టీటీడీ ఉపసంహరించుకోవాలి.

తిరుపతి స్థానిక టాక్సీ డ్రైవర్లకు ఘాట్ రోడ్డు ప్రయాణం పై పూర్తి అవగాహనతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అనేక సంవత్సరాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్లకు ఘాట్ రోడ్ మలుపుల అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అలాంటి వాహనాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టాలి.

టీటీడీ అధికారుల,అధికార పార్టీ నాయకుల తీరు చూస్తే తిరుపతి ప్రజలపై ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక సమస్యను సృష్టించడం స్థానికులపై ఒత్తిడి తీసుకురావడం కాళ్ల బేరానికి రప్పించుకోవడం, తామే సమస్యను పరిష్కరించినట్లు చిల్లర డ్రామాలు ఆడటంతో టిటిడి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్నారు.

తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదాల నివారణకు….
1) టీటీడీ,RTO అధికారుల సమన్వయంతో ఘాట్ రోడ్ లో వెళ్లే వాహనాల “ఫిట్ నెస్” ను పరిశీలించండి,డ్రైవర్లకు “హెవీ వెహికల్” లైసెన్స్ ఉందా లేదా అని తనిఖీలు చేసే నాధుడే లేకపోవడం ప్రమాదాలకు మూల కారణం.
2) తిరుమల ఘాట్ రోడ్ లో టీటీడీ నిబంధనల ప్రకారం 28 నిమిషాలు తిరుమల కొండకు వెళ్లేందుకు అలాగే తిరుపతికి 40 నిమిషాలు సమయపాలన పాటించాలి అని ప్రైవేటు వాహన డ్రైవర్లకు తెలిసేలా ఘాట్ రోడ్ లో ఎక్కడ “సూచిక బోర్డులు” ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
3) టిటిడి అధికారులు రెండు ఘాట్ రోడ్డులలో “స్పీడ్ రాడార్ గన్స్” ఏర్పాటు చేసి స్పీడు లిమిట్ ను అతిక్రమించిన వాహనాలకు జరిమానా విధిస్తే ప్రమాదాల నివారించవచ్చు.
4) తిరుమల రెండు ఘాట్ రోడ్లలో అక్కడక్కడ విజిలెన్స్ సెక్యూరిటీ, తిరుమల పోలీస్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి అతి వేగంగా నడిపే వాహనాల స్పీడుకు జరిమానాలతో కళ్లెం వేయండి.
5) తిరుమల కొండకు 15 సంవత్సరాల పైబడిన ట్యాక్సీలను నియంత్రించాలని ఆలోచిస్తున్న టిటిడి కచ్చితంగా వారం రోజుల లోపల ఉపసంహరించుకోవడం తథ్యం అని స్థానిక సమస్యలపై
“పొగ పెట్టడం నీళ్లు చల్లడం” టీటీడీ కి పరిపాటిగా మారింది.

 

LEAVE A RESPONSE