Suryaa.co.in

Andhra Pradesh

దేశంలోనే అతిపెద్ద స్కాం.. ఇదిగో సాక్ష్యాలు..

– పేదల రూపాయి బియ్యం బొక్కేసి 5 వేల కోట్లు లూటీకి పాల్పడ్డ వైసీపీ పెద్దలు
వైసీపీ రేషన్ డాన్లు.. అంతర్జాతీయ రైస్ స్మగ్లర్లు
కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ రేషన్ బియ్యం మాఫియా దందా
– పేదల బియ్యాన్ని పందికొక్కుల కంటే దారుణంగా దిగమింగుతున్నారు
– సీఎం జగన్‌కు బియ్యం స్మగ్లర్లపై చర్య తీసుకునే దమ్ముందా
– టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

జగన్మోహన్ రెడ్డిఏలుబడిలో నిత్యం అనేక కుంభకోణాలు రాష్ట్రంలో వెలుగుచూస్తూనేఉన్నాయని, ఆఖరికి అత్యంత నీచంగా పేదల కడుపునింపే రేషన్ బియ్యాన్నికూడా జగన్ రెడ్డిప్రభుత్వం తమ అవినీతివనరుగా మార్చుకుందని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరి లోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా…

గతంలో చంద్రబాబునాయుడి హాయాంలో రేషన్ దుకాణాలను మినీసూపర్ బజార్లుగా మార్చి, పేదలకు తక్కువధరకే అన్నిరకాల నిత్యావసర వస్తువులు అందించారు. పండుగలవేళ సంక్రాంతికానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలతో పండుగల సరుకుల్ని రేషన్ షాపుల ద్వారా టీడీపీప్రభుత్వం అందిస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక అరకొరగా ఇచ్చే పంచదార, కంది పప్పుధరలను కూడా అమాంతంపెంచేశాడు. అదలా ఉంటే, అసలు రేషన్ బియ్యాన్నే ఈప్రభుత్వంలోని కొన్ని పందికొక్కులు టన్నులకు, టన్నులు బొక్కేస్తున్నాయి.

పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని, ఏకంగా గోదాములనుంచే దారిమ ళ్లించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకుతరలిస్తున్న వైనంపై ఇటీ వలే పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక కాకినాడ పోర్టు నుంచి ఎక్కువగా విదేశాలకు సరఫరా అయ్యింది ఈ దొంగ రేషన్ బియ్యమే. దొంగ బియ్యం ఎగుమతుల్లో కాకినాడపోర్ట్ నంబర్ 1స్థానంలోఉందనే చెప్పాలి.

ఈస్థాయిలో పేదలబియ్యాన్ని వైసీపీనేతలు బొక్కేస్తూ, విదేశాలకు తరలించి సొమ్ముచేసుకుంటుంటే, ఆ శాఖకుచెందిన మంత్ర్రి, బూతులశాఖామంత్రి తనకువచ్చిన బూతులతో మీడియాసంస్థల పై విరుచుకుపడి, సదరుయాజమాన్యాలను దుర్భాషలాడాడు. బూతులమంత్రి మాట్లాడిందిఅంతా, అవినీతిపత్రిక, జగన్ ప్రభుత్వా నికి చెందిన పకోడిపేపర్ పత్రికల్లో బియ్యంఎగుమతులకు సంబంధించి మతిలేనిరాతలు రాశారని, కల్పితకథనాలు రాశారని రాసుకొచ్చింది.

ఎవడు మతిఉండి మాట్లాడుతున్నాడో, దొంగతనం బయటపడ్డాక దొంగలుఎలా ఎగిరెగిరి పడతున్నారో, బూతుల మంత్రికి దొంగబియ్యం వ్యాపారంలో ఉన్నవాటాఎంతో, దొంగ బియ్యం వ్యాపారంలో డాన్ గా పేరుపొందిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ్ రెడ్డి పాత్రేమిటో తేల్చడానికే నేను మీడియా ముందుకువచ్చాను.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే అయితే, ఆయన తండ్రి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. ద్వారంపూడి సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈవిధంగా ద్వారంపూడి కుటుంబమంతా బియ్యం వ్యాపారంలో మునిగి తేలుతూ, బూతుల మంత్రి కొడాలి నానిని తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుని పేదల బియ్యాన్ని పందికొక్కుల కంటే దారుణంగా దిగమింగుతున్నారు. అలాంటివాళ్లతో జగతకట్టిన ఈ చదువురాని సన్నాసి, బూతుల మంత్రి కొడాలినాని బియ్యం అక్రమ రవాణాపై నేడు మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా?.

ఒక్కసారి కాకినాడపోర్టు నుంచి విదేశాలకు సరఫరా అయిన బియ్యం ఎగుమతులవివరాలు పరిశీలిద్దాం.
అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (APEDA) వెబ్ సైట్లో పరిశీలిస్తే, ఏ ప్రాంతం నుంచి ఏ వ్యవసాయ ఉత్పత్తులు, ఎంత మొత్తంలో ఏఏదేశాలకు ఎగుమతి అవుతున్నాయనే వివరాలు స్పష్టంగా ఉంటాయి. కాకినాడపోర్టునుంచి జరిగిన ఎగుమతుల వివరాలు పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత పరిమాణంలో కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి, అది వరకు ఎంతజరిగాయో ఒక్కసారి పరిశీలిద్దాం. 2014 నుంచి 2019 వరకుజరిగిన బియ్యం ఎగుమతుల వివరాలు, ఆ తర్వాత జగన్ సర్కార్ లో ఇప్పటివరకు జరిగిన బియ్యం ఎగుమతుల వివరాలు పరిశీలిస్తే ఈ బియ్యం దొంగల బండారం బయటపడుతుంది.
Rice Exports from Kakinada Port
In TDP Government
Year Quantity (MT) Value (Crores)
2014-15 22.4 Lac 4881
2015-16 19.4 Lac 3917
2016-17 20.4 Lac 4430
2017-18 21.71 Lac 5048
2018-19 18.09 Lac 4483
Average per Year 20.3 Lac

Rice Exports from Kakinada In YSRCP Government
Year Quantity (MT) Value (Cr) Quantity Increase when compared to TDP Government
2020-21 31.51 Lac 7972 31.5-20.3 =11.2 Lac MT
2021-22(till November) 30.3 Lac 7710 30.3-20.3=10 Lac MT (Till Nov)
2018-19లో 18 లక్షల 09 వేల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతిఅయితే, దానివిలువ రూ.4,483 కోట్లు. అంతకు ముందు సంవత్సరాలు లెక్కలుపరిశీలిస్తే కాకినాడపోర్టు నుంచి 18 లక్షలమెట్రిక్ టన్నులనుంచి 21లక్షల మెట్రిక్ టన్నులవరకే బియ్యం ఎగుమతులుజరిగాయి. 2014-15లో 22 లక్షల మెట్రిక్ టన్నులు, 2015-16 లో 19 లక్షల 40వేల మెట్రిక్ టన్నులు, 2016-17లో 20.4లక్షలమెట్రిక్ టన్నులు, 2017-18లో 21.70 లక్షల మెట్రిక్ టన్నులు, 2018-19లో 18లక్షల మెట్రిక్ టన్నులబియ్యం విదేశాలకు ఎగుమతిఅయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హాయాంలో 2014-19 మధ్య నాన్ బాసుమతిరకం బియ్యం ఏటా సగటున 20.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎగుమతి అయ్యాయి.

కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2021-22లో ఏకంగా రికార్డుస్థాయిలో కాకినాడపోర్టు 31 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2021-22 ఆర్థికసంవత్సరంలో కేవలం నవంబర్ వరకే దాదాపు 30.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగాయిని చెబుతున్న మంత్రి నానీ గతానికి ఇప్పటికీ అసాధారణంగా బియ్యం ఎగుమతులు ఎలా పెరిగియో సమాధానం చెప్పాలి. రెండున్నర సంవత్సరాల్లోనే ఏటా 11 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు పెరిగేలా అంత గొప్ప పనులుఈప్రభుత్వం ఏంచేసిందో బూతులమంత్రి చెప్పాలి. ఈ పెరుగుదల కేవలం మీ యొక్క రేషన్ బియ్యం దోపిడీ వల్ల కాదా?

దేశంలో మిగతా పోర్టుల్లో పెరగనంతగా ఒక్కఏపీలోని కాకినాడ పోర్ట్ నుంచే బియ్యం ఎగుమతులు ఈస్థాయిలో ఎలా పెరిగాయో, ఎందుకు పెరిగాయో బూతులమంత్రి చెప్పగలడా? ఎందుకంటే తన భాగస్వామి ద్వారంపూడితో కలిసి దొంగ బియ్య దుకాణం తెరచిన సన్నాసి మంత్రి టన్నుల టన్నుల బియ్యం పేదలకు ఇవ్వకుండా విదేశాలకు తరలించేస్తున్నాడు. 2018-19లో కేవలం రూ.4,483 కోట్ల విలువైన బియ్యం మాత్రమే విదేశాలకు ఎగుమతి అయితే, 2021-22లో 31.05 లక్షలమెట్రిక్ టన్నులు, అంటే రూ.7,975కోట్లవిలువైన బియ్యంఎగుమతి అయ్యాయి.

దేశంలో ప్రధానంగా బియ్యం ఎగుమతిఅయ్యే పోర్టులు రెండే ఉన్నాయి. వాటిలో కాకినాడపోర్ట్ ఒకటైతే, రెండోదిగుజరాత్ లోని ముంద్రాపోర్ట్. గుజరాత్ పోర్టునుంచి గత మూడేళ్లలో బియ్యం ఎగుమతులు ఇంత అసాధారణంగా పెరగలేదు. కానీ, కాకినాడ పోర్ట నుంచి మాత్రం 11 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగాయి.
Rice Export from Mundra Port Gujarat
Year Quantity Value
2017-18 13.85 3997
2018-19 13.59 4179
2020-21 18.04 5291
2021-22 (Till Nov) 11.01 2984

2018-19లో ముంద్రా పోర్ట్ నుంచి 13.6 లక్షల మెట్రిక్ టన్నులబియ్యం విదేశాలకుఎగుమతి అయితే, 2021-22లో 18 లక్షలమెట్రిక్ టన్నులు ఎగుమతి అయ్యాయి. ముంద్రాపోర్ట్ లో కేవలం 4.4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పెరిగితే, కాకినాడ పోర్ట్ నుంచి 11.2 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులు ఎలాపెరిగాయో గడ్డం మంత్రి చెప్పగలడా?

గతంలో కూడా పేదల బియ్యం దారిమళ్లుతోందని, పత్రికల్లో అనేక కథనాలువచ్చాయి. కైకలూరులో రేషన్ బియ్యం గోదాము నుంచి దాదాపు వేలాది బస్తాల పేదల బియ్యం దారిమళ్లుతోందని, చౌక బియ్యం దొడ్డిదారిన, అక్రమమార్గాన విదేశాలకు తరలిపోతోందని ఆధారాలతో కూడిన కథనాలు వచ్చాయి. అలా దారిమళ్లిన బియ్యం అటు నుంచి అటు కాకినాడ పోర్ట్ కేంద్రంగా విదేశాలకు తరలించారో ఇప్పుడు స్పష్ట మవుతోంది.

రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించే క్రమంలో పేదలకుఇస్తున్న బియ్యాన్ని వారిసంచిలో పడీపడగానే నేరుగా వారినుంచే కేజీ రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లించి ఈ ప్రభుత్వమే దళారుల ద్వారా కొనుగోలు చేస్తోంది. కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు తరలివెళ్తున్న బియ్యం అంతా ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తాముపరిశీలించా ము. బియ్యం ఎగుమతులకు సంబంధించి గతంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి ఐవరీకోస్ట్ లో తాము గోదాములు నిర్మిస్తు న్నామని, అలానే కాకినాడలో గోదాములున్నాయని చెప్పుకొచ్చాడు. (దానికి సంబంధించిన వీడియోను పట్టాభిగారు ఈ సందర్భంగా విలేకరులకుప్రదర్శించారు)

ద్వారంపూడి తాను స్వయంగా ఐవరీకోస్ట్ వెళ్లానని, అక్కడ గోదాముల నిర్మాణం చేస్తున్నామని గతంలో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు చిలుకపలుకులు పలికారు. 11లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు తరలించి, నిల్వ చేయాలంటే అక్కడ కూడా గోదాములుకట్టాల్సిందే. అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిచెప్పా డు. కానీ ఏపీనుంచి ఏఏ దేశాలకు బియ్యం సరఫరా అవుతున్నాయి. గతాని కంటే ఎంత పరిమాణంలో ఆ దేశాలకు బియ్యం ఎగుమతులు పెరిగాయో పరిశీలిద్దాం.

Abnormal Increase of Rice Export from Kakinada Port to the below West African Countries during YSRCP Rule.
Country Quantity in 2018-19 (MT) Quantity in 2020-21 (MT) Quantity Increase in MT
Ivory Coast 3.14 Lac 5.25 Lac 2.11 Lac
Togo 0.29 Lac 2.50 Lac 2.21 Lac
Senegal 6.02 Lac 7.77 Lac 1.75 Lac
Benin 1.12 Lac 3.73 Lac 2.61 Lac
Guinea 2.55 Lac 4.00 Lac 1.45 Lac
Total 13.12 Lac 23.25 Lac 10.13 Lac

పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని ఐవరీకోస్ట్ దేశంతోపాటు, దానిపక్కన ఉండే బెనిన్, సెనిగల్, గినియా మరియు టోజో అనే దేశాలకు కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఐవరీకోస్ట్ తోపాటు, ఆయా దేశాలతోయ ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉంది.
ఐవరీకోస్ట్ కు 2018-19లో 3 లక్షల 14వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక ద్వారంపూడి నేత్రత్వంలో 2020-21లో 5లక్షల 25వేల మెట్రిక్ టన్నులు ఐవరీకోస్ట్ కు ఎగుమతి అయ్యాయి. రెండేళ్లలోనే 2లక్షల 11వేల మెట్రిక్ టన్నుల బియ్యం అధికంగా దొంగ బియ్యం పుణ్యమా అని ఎగుమతి అయ్యాయి.

ఐవరీకోస్ట్ పక్కనుండే బెనిన్ దేశానికి 2018-19లో లక్షా12వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయితే, 2020-21లో 3లక్షల 73వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయ్యాయి. రెండేళ్లలో 2లక్షల 60వేల మెట్రిక్ టన్నుల దొంగ బియ్యం ఎగుమతులు బెనిన్ దేశానికి పెరిగాయి. అలానే సెనిగల్ దేశానికి 2018-19లో 6లక్షలమెట్రిక్ టన్నులు ఎగుమతి అయితే, 2020-21లో 7లక్షల77వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. టోజో దేశానికి 2018-19లో కాకి నాడ పోర్ట్ నుంచి కేవలం 29వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఎగుమతి అయితే, 2020-21లో 2లక్షల50వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి.

రెండేళ్లలో 2లక్షల20వేల మెట్రిక్ టన్నుల పెరుగదలనమోదైంది. గినియా దేశానికి 2018-19లో కేవలం2.5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే, 2020-21లో 4లక్షల మెట్రిక్ టన్నులు ఎగు మతిఅయ్యాయి. పశ్చిమ ఆఫ్రికాలోని ఈ 5 దేశాలకు ఒక్క 2020-21 ఆర్ధిక సంవత్సరంలోనే 10లక్షల 13వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి జరిగింది. ఏపీలోని రేషన్ దుకాణాల్లోనుంచి కొల్లగొడుతున్న బియ్యం మొత్తం కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాలోని ఈ ఐదు దేశాలకే ఎగుమతి అవుతున్నాయి.

కాకినాడపోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులు ఈస్థాయిలో పెరగడం పైకూడా చదువురాని సన్నాసిమంత్రి కట్టుకథలు చెబుతున్నాడు. వారికి మద్ధతుగా నేటి ఉదయం రాష్ట్ర వ్వయసాయ శాఖా మంత్రి కన్నబాబు కూడా దొంగ బియ్యం సగ్మ్లింగ్ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ మీడియాపై తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఆధారాలతో కూడిన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న మీడియా సంస్థలపై పూర్వశ్రమములో ఒక జర్నలిస్టుగా, ఒక మీడియా సంస్థ ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం శోచనీయం. కన్నబాబు మాట్లాడుతూ పొరుగురాష్ట్రాలనుంచి వచ్చేబియ్యం కాకినాడపోర్టునుంచి ఎగుమతి అవుతున్నాయని అందువలనే ఎగుమతులు పెరగుతున్నాయని ఈ దొంగ బియ్యం వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

కన్నబాబు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లో పోర్టులు ఉంటే, ఆయా రాష్ట్రాలు బియ్యం ఎగుమతి కోసం కాకినాడపోర్టుకే వస్తాయా? చెన్నైపోర్ట్ నుంచి 2020-21లో 3లక్షల26వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యాయి. APEDA వారే ఈ సమాచారం తమ వెబ్ పేజీలో పొందుపరిచారు. తమిళనాడులో చెన్నైపోర్టు తో పాటు, ట్యూటీకారన్ పోర్ట్ నుంచి కూడా బియ్యం ఎగుమతి అవుతోంది. పొరుగున్న ఉన్న ఒడిశా నుంచి ఎగుమతి జరగాలంటే వారికి దగ్గరగా విశాఖపట్నం పోర్టు ఉంది. 2020-21లో 11లక్ష ల మెట్రిక్ టన్నుల బియ్యం విశాఖపట్నం పోర్ట్ నుంచి ఎగుమతి అయ్యాయి.

ఏపీలో కూడా కాకినాడ పోర్టుతో పాటు విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్ట్ ల నుంచి కూడా బియ్యం ఎగుమతులు జరుగుతుంటే వ్యవసాయ మంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. ఆయనచెప్పే కాకమ్మ కబుర్లు ప్రజలెవరూ నమ్మరు, కావాలంటే దిక్కుమాలిన బురదపత్రికలో రాసుకోవడానికి పనికొస్తాయి. బూతులమంత్రిలాగా మేంగాలికబుర్లు చెప్పడం లేదు, కేంద్రప్రభుత్వ సమాచారంతో వాస్తవాలు మాట్లాడాము. కన్నబాబు గతంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు జరగలేదా అన్న మరో ప్రశ్నకు జవాబుగా మేము పైన ఒక పట్టిక ద్వారా గతంలో ఎంత ఎగుమతులు కాకినాడ నుంచి జరిగాయో నేడు అసాధారణంగా ఎలా పెరిగాయో సవివరంగా తెలియపరిచాం. ఆ వాస్తవాలు అర్ధం చేసుకుని ఇకపై ఈ దొంగ బియ్యం వ్యవహారాన్ని వారు మానుకుంటే మంచిది.

కాకినాడ పోర్ట్ నుంచే బియ్యం స్మగ్లింగ్ ఈస్థాయిలో జరగడానికి మరో కారణం కాకినాడలోని రెండుపోర్టులు తన బినామీ అయిన అరబిందో సంస్థకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కట్టబెట్టడమే. అరబిందో సంస్థకు ఈ ముఖ్యమంత్రి కాకినాడలోని రెండు పోర్ట్ లను ధారదత్తం చేసింది పేదల కడుపుకొట్టి, రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం కోసమేనని దొంగ బియ్యం ఎగుమతులుచూస్తే అర్థమవుతోంది.

కాకినాడపోర్ట్ కేంద్రంగా లక్షలమెట్రిక్ టన్నులబియ్యం ఐవరీకోస్ట్ సహాచుట్టుపక్కలున్న ఆఫ్రికా దేశాలకు తరలిపోతున్నాయి. పశ్చిమాఫ్రికా లోని ఐవరీకోస్ట్, దానిచుట్టుపక్కలున్న దేశాలకే బియ్యం అక్రమంగా తరలిపోవడానికి ఇంకో కారణం ఆఫ్రికా ఖండంలో జగన్మోహన్ రెడ్డి సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలకు మద్యం వ్యాపారాలతో పాటు అనేక వ్యాపారాలు అనేక దేశాలలో ఉండటం అక్కడ వారికి అక్కడ మంచి ప్రాబల్యం ఉండటం. ఇప్పుడు వారితోపాటు వారి ఆశీస్సులతో ద్వారంపూడి కూడా తన భాగస్వామి కొడాలి నానితో కలిసి ఆఫ్రికా ఖండంలో పాగా వేస్తున్నాడు.

రాష్ట్రంకేంద్రంగా పశ్చిమఆఫ్రికాదేశాలకు తరలిపోతున్నబియ్యం స్మగ్లింగ్ పై ముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడు?ఏపీనుంచి ఆఫ్రికా దేశాలకు తరలిపోతున్న బియ్యం విలువ అధికారి కలెక్కల ప్రకారమే షుమారు రూ.2,700 కోట్లవరకు ఉంది. దానిని ఎంతలేదన్నా అక్కడ రెట్టింపుకు అమ్మడం ఖాయం. ఆ ప్రకారం చూస్తే కాకినాడ పోర్ట్ నుంచి హీనపక్షంగా ఏటా రూ.5వేల కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి బియ్యందొంగల ముఠా దోచుకుంటోంది. ఈవిధంగా బియ్యం దోచుకుంటూనే ఈకేవైసీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 5లక్షలవరకురేషన్ కార్డులు తొలగించారు.

బియ్యం మొత్తాన్ని ఈ జగన్ రెడ్డి, అతని దొంగలముఠానే దోచుకుంటుంటే ఇకపేదలకు ఎక్కడ బియ్యం దొరుకుతాయి?బియ్యందోపిడీలో మునిగితేలుతున్న బూతులమంత్రే మరోపక్కన ధాన్యం రైతులగురించి మాట్లాడుతున్నాడు. ధాన్యం బకాయిలు చెల్లించక అన్నదాతలుఆత్మహత్యలుచేసుకుంటుంటే, ఏమీ లేదన్నట్లే మంత్రి సిగ్గులేకుండా మాట్లాడతున్నాడు.నిన్న బూతులమంత్రి తననోటికిపనిచెప్పినా, పకోడిపేపర్లో పిచ్చి రాతలురాసినా, మీరుచేసే అవినీతిఎక్కడికీపోదు. బియ్యం ఎగుమతులపేరుతో ఏటా రూ.5వేలకోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి అతని బియ్యం దొంగల ముఠా ఎలా దోచుకుంటున్నారో ప్రజలంతా గమనించాలనికోరుతున్నాం.

LEAVE A RESPONSE