– సోషల్ మీడియాలో టీడీపీసానుభూతిపరులు పెట్టే పోస్టింగ్స్, కామెంట్సే మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కు తప్పుగా కనిపిస్తున్నాయా?
– వైసీపీవారు పెట్టే అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు, మార్పింగ్ ఫోటోలు, వీడియోలు కనిపించడంలేదా?
– బాధ్యతాయుతమైన పదవిలోఉండి, సాటిమహిళగా మహిళల్ని అవమానించేవారిని కట్టడిచేయకుండా, వేధించేవారికి వంతపాడటం బాధాకరం
• ప్రజలకోసం నీతివంతమైన రాజకీయాలు చేసే టీడీపీవాళ్లది తప్పా.. పైశాచిక ఆనందంతో పిచ్చిపట్టినట్టు ఆడబిడ్డల్ని దారుణంగా అనరాని మాటలనేవారు మంచివాళ్లా?
• వర్ర రవీంద్రరెడ్డి అనేవైసీపీ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో పెట్టే దారుణాతిదారుణమైన పోస్టింగ్స్ మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కు కనిపించడంలేదా?
-రవీంద్రరెడ్డి పై చర్యలుతీసుకునే దమ్ము, ధైర్యం మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కుఉందా?
• సోషల్ మీడియావేదికగా చెలరేగిపోయేవారిపై యుద్ధంచేస్తానంటున్న మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ … ఆ యుద్ధంలో మమల్నిభాగస్వాముల్ని చేయాలని కోరుతున్నాం
• మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ నాణేనికి ఒకవైపుచూసి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదు
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ప్రశ్నించినవారికి జవాబుచెప్పలేక బూతులుతిట్టే సన్నాసులు, ప్రజలకోసం పనిచేసేవారిపై ఇష్టానుసారం సోషల్ మీడియాసాక్షిగా వేధింపులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నవారి పైత్యం పరాకాష్టకు చేరిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళరాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అని త ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమెమాటల్లోనే …
“ నీతివంతమైన రాజకీయాల్ని ప్రజలుస్వాగతిస్తారు. కానీ పైశాచిక ఆనందంతో ఆడబిడ్డల్ని వేధిస్తూ, వారిఫొటోలు మార్ఫింగ్ చేసి, వాటితో అసభ్యకరమైన వీడి యోలు విడుదలచేసే దుస్థితికి అధికారపార్టీ వారువచ్చారు. ఆడబిడ్డలపై జరిగే దారుణాలను చిన్నవిగాచూపిస్తూ రాష్ట్రమహిళాకమిషన్ ఛైర్ పర్సన్ నంగనాచి మాటలు మాట్లాడుతోంది.
ఆమె మాటలు వింటుంటే, ఈ 4ఏళ్లలో ఈనెలలోనే ఆమె నిద్రలేచి బయటకు వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తూ పెడుతున్న కొందరుప్రబుద్ధుల నీతి మాలినతనం ఆమెకు ఇప్పుడే కనిపించిందా?
గతంలో సవాంగ్ డీజీపీగాఉన్నప్పుడు, సుచరిత హోంమంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ వారు టీడీపీవారిపై సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్, పోస్టింగ్స్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మర్చిపోయిందా?
రాష్ట్రమహిళా కమిషన్ ఛైర్ పర్సన్, గతంలో హోంమంత్రిగా ఉన్నసుచరిత, డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగ్ లు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పాలకులఅవినీతి, అరాచకాల్ని ఎత్తిచూపినవారిపై అక్రమకేసులుపెట్టి జైళ్లకు పంపించారు. ఆ విషయం మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ మర్చి పోయిందా..లేక తెలియనట్టు నటిస్తోందా? రంగనాయకమ్మవయసుని కూడా చూడకుండా, 60ఏళ్లు పైబడిన పెద్దావిడను సీఐడీఆఫీసులో ఉదయంనుంచి సాయంత్రం వరకు కూర్చొ బెట్టారు. ఇలాంటి ఉదంతాలెన్నోఉన్నాయి.
స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఇతరకిందిస్థాయి అధికారపార్టీనేతల దుశ్చర్యలు, దుర్మార్గా లు, పనితీరుని ప్రశ్నించారన్న అక్కసుతో టీడీపీమహిళానేతల్ని, కార్యకర్తల్ని ఎంతగా వేధించారో మర్చిపోయారా? ఆనాడుటీడీపీవారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ కామెంట్స్ పై అమానుషంగా స్పందించిన వారికి ఇప్పుడెందుకు వేడిపుడుతోంది? టీడీపీవారిని తిడుతూపెడితే సంతోషిస్తారా? అదేటీడీపీవారు తిరిగి అధికారపార్టీని, ము ఖ్యమంత్రిని అంటే తప్పా?
మాజీ ముఖ్యమంత్రి భార్యని అసెంబ్లీలో అవమానించినప్పుడు, వైసీపీ వారిపై మహిళా కమిషన్ సుమోటో గా ఎందుకు కేసులు పెట్టలేదు?
శ్వేతారెడ్డి ఏంతప్పుచేసిందని ఆ అమ్మాయిని లక్ష్యంగాచేసుకొని వైసీపీ పేటీఎమ్ బ్యాచ్, సోషల్ మీడియా వాళ్లు ఆమెని దారుణంగా వేధిస్తున్నారు? శ్వేతారెడ్డి.. రెడ్డా.. చౌదరా..లేక కాపా అనేది ఇక్కడ ముఖ్యంకాదు. ఆడబిడ్డను గౌరవించాలనే ఇంగితం లేని వారు పదవుల్లో ఉండటం, ప్రజాప్రతినిధులుగా ఉండటం నిజంగా ఏపీప్రజల దౌ ర్భాగ్యమే. దేశాలుదాటి ఎక్కడోఉండి పనిచేసుకొనే ఆడపిల్లను ఇష్టమొచ్చినట్టు వేధి స్తారా?
భారతిరెడ్డి ని టీడీపీసోషల్ మీడియావారు ఏదోఅన్నారని గతంలో మీరు, మీప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. సీఎం భార్యను ఎవరేమన్నారో చెప్పకుండా తప్పుడుకేసులతో వేధించారు. వైసీపీపేటీఎమ్ కుక్కలు చంద్రబాబుని, ఆయనకుటుంబసభ్యుల్ని ఎన్నెన్నిమాటలన్నారో ప్రజలకు గుర్తుంది. అదేటీడీపీవారు జగన్ కుటుంబసభ్యుల్ని ఎప్పుడైనా హద్దులుమీరి మాట్లాడారా? జగన్ భార్యను, అతనితల్లిని, చెల్లిని టీడీపీవారుఎవరైనా సరే నోటికొచ్చినట్టు బూతులుతిట్టారా?
చంద్రబాబు భార్య భువనేశ్వరిని అసెంబ్లీసాక్షిగా అవమానించినప్పుడు ఈ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఏమైంది? అప్పుడెందుకు ఆమెసుమోటోగా కేసులు పెట్టి, బూతులుతిట్టినవారిపై చర్యలుతీసుకోలేదు? చంద్రబాబుగారి బాధను అవమానిస్తూ, పిచ్చికూతలుకూసేవారందరికీ భవిష్యత్ లో చుక్కలుచూపిస్తాం. మాపార్టీ మహిళా కార్యకర్తల్ని వేధిస్తున్నవారివైఖరిని తప్పుపట్టిన చంద్రబాబుని వేలిత్తిచూపుతారా? అసలు మీకుఅంతస్థాయి ఉందా?
టీడీపీనేతలు, ముఖ్యంగా మహిళానేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ , పోస్టింగ్స్ పెట్టిన వైసీపీవారిపై, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్, డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు?
సోషల్ మీడియాలో టీడీపీవారి పోస్టింగ్స్, కామెంట్స్ మాత్రమే తప్పుగా కనిపిస్తున్నాయా? వైసీపీవారు పెట్టేఅసభ్యకర కామెంట్స్, మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు మీకళ్ల కు కనిపించవా? సోషల్ మీడియాసాక్షిగా టీడీపీవారిని వేధించేవాళ్లను వేధించేవారిలో ఎంతమందిని రాష్ట్ర మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ అరెస్ట్ చేయించింది? ఎంతమందిపై హోంమంత్రి, డీజీపీ చట్టరపరమైన చర్యలుతీసుకున్నారు?
హోంమంత్రి, డీజీపీ, మహి ళా కమిషన్ ఛైర్ పర్సన్ వైసీపీవాళ్లు ఏమన్నా, ఏంచేసినా వారికి వినపడదు. కనపడ దు… మాట్లాడరు. తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నేతలుగా మేం ఎప్పుడూ మహిళల తరుపున పోరాడుతూనే ఉంటాము. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న టీడీపీ వారిని పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నపోలీసులు, వైసీపీవారిని ఎందుకుపిలవరు?
రవీంద్ర రెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కు ఉందా?
వర్ర రవీంద్రరెడ్డి అనే వెధవ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, భారతిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నాడో తెలియదుగానీ, అతను అసలు మనిషికే పుట్టాడా అన్నఅనుమానం కలుగుతోంది. రవీంద్రరెడ్డి ఫేస్ బుక్ ఐడీ చూస్తే టీడీపీ, జనసేనమహిళల గురించి వాడురాసే అసహ్యకరమైన పదజాలంచూస్తే ఎవరైనా వాడిపీకకోసేస్తారు. అంతదారు ణంగా రాస్తున్నాడు. అలాంటి నీతిజాతిలేని వెధవలు భారతిరెడ్డికి, జగన్ రెడ్డికి ఇష్టులు.
అతను టీడీపీ, జనసేన మహిళల్ని, ఆయాపార్టీల కార్యకర్తల్ని ఎంతఅసభ్యకరమై న మాటలు అంటున్నాడో, ఎలాంటి పోస్టింగ్స్ , కామెంట్స్ పెడుతున్నాడో వాటికి సం బంధించిన అన్నిఅధారాలను బయటపెడతాం. రవీంద్ర రెడ్డి పై చర్యలుతీసుకునే దమ్ము, ధైర్యం మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కుఉందా? టీడీపీవాళ్లను అంటే ఒకన్యాయం.. వైసీపీవారినంటే మరోన్యాయమా? సోషల్ మీడియావేదికగా టీడీపీమహిళానేతలు, కార్యకర్తలు ఎదుర్కొనే సమస్యల్ని మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కు తెలియచేస్తాం.
ఆమె ఎలాంటిచర్యలుతీసుకున్నా, ఆమెతోకలిసి నడవడానికి మేంసిద్ధం. అలానే ఇతర పార్టీల మహిళలుకూడా వస్తారు. అందరిసమక్షంలో సోషల్ మీడియావేధింపులపై ఎ లాంటిచర్యలు తీసుకుంటున్నారో, ఎవరిపై యద్ధంచేద్దామనుకుంటున్నారో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ చెప్పాలి. వైసీపీకి చెందిన రవీంద్రరెడ్డి జగన్ రెడ్డి అడ్డాలో ఉండి, రాసేపిచ్చిరాతలు, వాగేవాగుడు మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కుకనిపించలేదా?
ముం దు అతనిపై ఏంచర్యలు తీసుకుంటుందో ఆమెసమాధానంచెప్పాలి. రవీంద్రరెడ్డి ఫేస్ బుక్ లింక్ మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ కి పంపిస్తాను. ఆమె అదిచదివాక ఒక ఆడబి డ్డగా స్పందించి ఏంచర్యలు తీసుకుంటారో తీసుకోవచ్చు. టీడీపీశాసనసభ్యురాలు ఆది రెడ్డి భవానీపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడినవారిపై ఏంచర్యలు తీసు కున్నారో, ఆమెఇచ్చిన ఫిర్యాదు ఏమైందో డీజీపీ సమాధానంచెప్పగలడా?
వర్ర రవీంద్రరెడ్డి, జగన్ సతీమణి భారతిరెడ్డిపక్కనే నిలబడి ఎంతో చనువుగా ఫోటోలుదిగాడు. వాటిపై ఆమె ఏం సమాధానం చెబుతారు?
వర్ర రవీంద్రరెడ్డి ఇప్పుడు జగన్ ఉన్నాడని రెచ్చిపోతున్నావు. నువ్వురాసే ప్రతి అక్ష రానికి, వాగేప్రతిమాటకు, నువ్వుచేసిన కామెంట్స్ మొత్తానికి నువ్వుఎదుర్కొనే పర్య వసనాలు దారుణంగా ఉంటాయి. ఎవడోవిసిరే ఎంగిలిమెతులకోసం పనిచేసే రవీంద్ర రెడ్డికే అంతఉంటే, ప్రజలకోసం పనిచేసేమాలాంటి వాళ్లకు ఎంతఉండాలి? బాధ్యతాయు తమైన పదవుల్లోఉండి, ప్రజలకు జవాబుదారీగాఉండాల్సిన వారు నాణేనికి ఒకవైపే చూడటం ఎంతమాత్రం సరైందికాదు.
రవీంద్రరెడ్డి, జగన్ సతీమణిభారతిరెడ్డితో, ఎంతోచనువుగా పక్కనే ఫోటోలు దిగడంపై ఆమే సమాధానంచెప్పాలి” అని అనిత డిమాండ్ చేశారు.