బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామి
బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా… జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు… బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం… నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం… ఇవన్నీ కూడా బీసీలకు మేలు చేసేవే.బీసీలకు జాతీయ స్థాయిలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల అన్యాయాన్ని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతున్నది… ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని వచ్చే బిజెపి ప్రభుత్వం సరిదిద్దుతుంది.ఆరు నెలల తర్వాత తెలంగాణలో బిజెపి ఏర్పడడం ఖాయం… బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ తో బీసీలే కాకుండా అన్ని వర్గాలకు మంచి రోజులు వస్తాయి.బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.