-రాజకీయ కక్ష సాధింపులో భాగమే ఈ దుశ్చర్యలు
-రేవంత్ సర్కారు ఆగడాలను అడ్డుకుంటాం
-మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఫార్ములా – ఈ కార్ రేసింగ్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేటీఆర్ పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష లో భాగమేనని ఆయన విమర్శించారు. ఈ రకమైన కాంగ్రెస్ దుశ్చర్యలు బీఆర్ఎస్ నేతల నైతిక స్తయిర్యాన్ని దెబ్బతీయలేవని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, ప్రజాసమస్యలపై ఆయన సాగిస్తున్న పోరాటాలకు భయపడి కేసులతో వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేటీఆర్ పై తప్పుడు కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేతలు.
ఏదైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దబాయింపు ధోరణితో విచారణల పేరిట అక్రమ కేసులు పెడుతుందని ఆయన ఆరోపించారు.