-ఇది ఏపీ లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం
-మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారు
-ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్
బీఆర్ఎస్ దెబ్బకే ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ విషయం లో కేంద్రం దిగివచ్చింది.ఇది ఏపీ లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం.కేటీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, ఒక అధ్యయన బృందాన్ని పంపారు.ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేసాయి. AP ప్రజలకి అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీనే.
‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందాం.ఉక్కు ఉద్యమంలో 32 మంది అసువులు బాసారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలువ రూ.3 లక్షల కోట్లు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్లు ఎగిరిపోతాయి.
జాతి సంపదను కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు.ఒకవేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం మొండివైఖరితో ప్రైవేటీకరణ చేసినా…. మళ్ళీ దాన్ని కాపాడుకొని, జాతీయo చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.ఇటీవల 3 రోజుల పాటు విశాఖలో పర్యటించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరుపున పోరాటం చేశాం.. వారికి అండగా నిలబడ్డాం.
RINL Expression of interest ను ఆహ్వానించింది. బీఆర్ఎస్ దెబ్బకే… కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఇవాళ విశాఖపట్నం లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదు… బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు.బైలడిల్లా గనులను విశాఖ స్టీల్ ప్లాంట్, బయ్యారం కు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు.క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా తెలుగు ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు.
RINL విలువ రూ.3 లక్షల కోట్లు అయితే… వాళ్ళు చూపించింది రూ.397 కోట్లు మాత్రమే.అదాని ఇంకా స్టీల్ ప్లాంట్ పెట్టకముందే… బైలడిల్లా గనులను అదానికి కట్టబెట్టారు.బైలడిల్లా గనులను అదానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి.విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెంటనే గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ఆదేశాలతో కేంద్రం మెడలు వంచి, ఇవాళ కేంద్రప్రభుత్వ ఉక్కు సహాయ మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించగలిగాం.’వైజాగ్ స్టీల్ ప్లాంట్’ ను ప్రైవేటీకరించమని వెంటనే కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.RINL కు సొంత గనులు కేటాయించాలి.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంబంధించిన 20 వేల ఎకరాల భూములను రాష్ట్రపతి పేరు మీద పెట్టుకున్నారు. దాన్ని వెంటనే RINL మీద ట్రాన్స్ఫర్ చేయాలి.RINL కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.విశాఖ స్టీల్ ప్లాంట్ సొంతకాళ్ళ మీద నిలబడేలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కు ఆర్థికసాయం, వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ మెట్రో, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ సహా విభన హామీలను నేటికీ నెరవేర్చలేదు.
మంత్రి హరీష్ రావు పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించిన తోట చంద్రశేఖర్
ఏపీ విషయంలో మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారు.ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్, సరుకు లేకనే … హరీష్ రావు పై అనవసర ఆరోపణలు చేస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని అంశాలపై మంత్రి హరీష్ రావు వాస్తవాలే మాట్లాడారు.ఆంధ్ర ప్రజలు తమ సమస్యలను తీర్చగలగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారు…ఆ నాయకుడే కేసీఆర్.దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది. కేసీఆర్, కేటీఆర్ విజన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ లను ఆంధ్రాకి తీసుకురావాల్సిందిగా నన్ను అక్కడి ప్రజలు కోరుతున్నారు. విశాఖపట్నంలో త్వరలోనే బీఆర్ఎస్ తరఫున భారీ బహిరంగ సభ ఉంటుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడినందుకుగాను, ఉద్యోగులు, కార్మిక సంఘాలు అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాల్సిందిగా అడుగుతున్నారు.