-6 నెలల్లో పనులు పూర్తి చేయొచ్చని కేఆర్ఎంబీ రిపోర్ట్ ఇచ్చింది
-చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం
-కేంద్రంపై ఏడ్వడం తప్ప కేసీఆర్ సాధించిదేమిటి?
– బట్టేబాజ్ గాళ్లారా… ప్రజలకు వేల కోట్ల సంక్షేమ పథకాలందిస్తున్న మోదీపై విమర్శస్తారా?
-టీఆర్ఎస్ సర్పంచులే మోదీని అభినందిస్తూ లేఖలు పంపుతున్నారు
-తెలంగాణకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చింది
– నడిగడ్డను ఎడారిగా మార్చిన కేసీఆర్ ను నిలదీయండి
-బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలో బిల్లులన్నీ వసూలు చేస్తాం
– దెబ్బలు తిన్న సిబ్బందికి ప్రమోషన్లు ఇస్తాం
-హత్యా రాజకీయలు చేసే టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టం
-గద్వాల బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నడిగడ్డ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనకు చెప్పారని తెలిపారు. ఆర్డీఎస్ పనులను 6 నెలల్లో పూర్తి చేసి 87,500 ఎకరాల సాగు నీరందించవచ్చని క్రిష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిందన్నారు. ఆర్డీఎస్ విషయంలో 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదంటూ ఏడవటం తప్ప కేసీఆర్ సాధించేమిటని ప్రశ్నించారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా 3 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులు తెలంగాణకు కేటాయించిందన్నారు. ఈ విషయంపై కేసీఆర్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 8వ రోజు పాదయాత్ర చేసిన బండి సంజయ్ కుమార్ గద్వాల పట్టణంలోని తేరు మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు.
వేలాదిగా తరలివచ్చిన ఈ సభకు బండి సంజయ్ తోపాటు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, మాజీ మంత్రి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, మాజీ మంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి , బిజెపి తమిళనాడు ఇంచార్జ్ పొంగులేటి సుధాకర రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, యాత్ర ప్రముఖ్, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి , యాత్రా ఉప ప్రముఖ్ వీరేందర్ గౌడ్ , లంకల దీపక్ రెడ్డి, కుమ్మరి శంకర్, జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…..
ఎక్కడికెళ్లినా ప్రజా సంగ్రామ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నరు.
గద్వాల నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బహిరంగ సభ… ఆర్డీఎస్ విజయోత్సవ సభ.
8 ఏళ్లాయే.. ఒక్క చుక్క నీరు రాలేదు.. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించకుండా కేసీఆర్ చేతగానితనంతో, అసమర్థతో వ్యవహరిస్తున్నడు.
ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం దొరికింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
RDS ఆధునీకరణతో అలంపూర్, గద్వాల 87 వేల 500 ఎకరాలకు నీళ్లు వస్తయ్.
నేను కేంద్ర జలశక్తి మంత్రి గజేద్ర సింగ్ షెకావత్ కి ఫోన్ చేసి వివరించా… RDS సమస్య గురించి చెప్పినా. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించమని.
ఆర్డీఎస్ పనులను కేంద్రం చేపడుతుందని షెకావత్ చెప్పారు.
మార్చి 9 వ తారీఖునాడు కేఆర్ఎంబీ టీం రిపోర్టు ఇచ్చింది. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్డీఎస్ పనులను 6 నెలల్లో పూర్తి చేసి ఈ నడిగడ్డ ప్రజలకు నీరందించవచ్చని కేఆర్ఎంబీ నివేదిక ఇచ్చింది. ఇదిగో రిపోర్ట్ కాపీ…
ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న డీకే అరుణమ్మను నేటి నుంచి.. ఆర్డీఎస్ అరుణమ్మగా పిలచుకోవాలి.
తుంగభద్రలో తెలంగాణకు రావాల్సిన వాటాను అందించేందుకు ఆర్డీఎస్ మెయిన్ కెనాల్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా నీళ్లందించేందుకు ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ డిజైన్ లో మార్పులు చేస్తోంది.
కాలువలోని సీపేజ్, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కాలువకు మరమ్మతులు, పునరుద్దరణ పనులు చేపట్టబోతోంది.
తెలంగాణ సరిహద్దు దగ్గర ఆర్డీఎస్ కాలువ నుండి, ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని కొలిచేందుకు టెలిమెట్రి చర్యలు చేపడుతోంది. ఈ మూడు అంశాలపై చర్యలు చేపట్టడం ద్వారా 87 వేల 500 ఎకరాకు నీళ్లు వచ్చేలా చేస్తోంది.
కేఆర్ఎంబీ వల్లే ఈ మూడు రాష్ట్రాల సమస్యను సులువుగా పరిష్కరించి ఆర్డీఎస్ ద్వారా మనకు రావాల్సిన ప్రతి నీటి చుక్క రాబోతోంది.
గద్వాల్ లో 300 పడకల ఆసుపత్రి కట్టిస్తనని సీఎం చెప్పి మూడేళ్లయింది. అతీగతీ లేదు. రోగమొస్తే పక్క రాష్ట్రం పోయి అక్కడి ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నరు.
ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి లేదు.. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నరు. కాని కేసీఆర్ సర్కారుకు చలనం లేకుండా పోయింది.
ఇంటికో ఉద్యోగమిస్తమన్న ముఖ్యమంత్రి .
317 జీవో సవరణ కోసం ఉద్యోగుల తరఫున మేం కొట్లాడితే మమ్మల్ని జైలుకు పంపిన్రు. బిజెపి కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు.
సమయానికి జీతాలివ్వకుండా ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేధిస్తున్నడు ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగుల కోసం దీక్ష చేస్తే నన్ను కూడా జైల్లో పెట్టిండ్రు.
పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలుకు పోయిన సిబ్బందిపై మైనారిటీ, ఎంఐఎం, టీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడుతున్నరు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎవరైతే ఎంఐఎం దాడిలో గాయపడ్డారో… ఆ సిబ్బందికి అదే ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చి దాడులకు తెగబడ్డ వారికి బుద్ది చెబుతాం.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలే కన్పిస్తున్నాయి. మొన్న ఖమ్మంలో సాయి గణేష్ స్థానిక మంత్రి అక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తుంటే అతనిపై 16 కేసులు బనాయించి రౌడీ షీట్ చేస్తామని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిండు. సాయి ఆత్మహత్యకు కారణమైన ఆ మంత్రి అక్రమాలు, ఆగడాల చిట్టా బీజేపీ దగ్గరుంది. బీజేపీ అధికారంలోకి రాగానే సాయి ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులిస్తుంటే కేసీఆర్ మాత్రం అవి తనవేనంటూ గొప్పలు చెప్పుకుంటుండు. రాష్రంలో గ్రామ పంచాయతీలకిచ్చే నిధులన్నీ కేంద్రానివే. టీఆర్ఎస్ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. చివరకు టీఆర్ఎస్ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రధానికి లేఖ రాసి అభినందిస్తున్నారు. దీనిని బట్టి టీఆర్ఎస్ ది ఎంత అసమర్ధ పాలనో అర్ధమవుతోంది.
కేసీఆర్ సాధించిందేమీ లేదు. కానీ మాటి మాటికి కేంద్రంపై, ప్రధానిపై నిందలు వేస్తున్నడు. కేంద్రంపై ఏడవడటం తప్ప కేసీఆర్ సాధించిదేమిటి? తెలంగాణకు కేంద్రం ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చింది. రోడ్లు, గ్రామ పంచాయతీలకు, టాయిలెట్లకు, స్మశాణ వాటికలు సహా మౌలిక సదుపాయలకు అన్ని నిధులు నా మోదీ ప్రభుత్వమే ఇస్తుంటే ఆయననే అవమానించేలా మాట్లాడతావా బట్టేబాజ్….
మొన్నటికి మొన్న టీఆర్ఎస్ మంత్రి అడుగుతుండు… నేను చెబుతున్న 2021 నాటికి వివిధ పన్నులు రూపంలో 1.68 లక్షల కోట్లు తెలంగాణకు చెల్లించింది. ప్రాయోజిత పథకాల రూపంలో, రహదారుల రూపంలో వేలాది కోట్లు చెల్లించింది.
ఈ గద్వాల నియోజకవర్గానికి………
ఒక్క రైతు వేదిక నిర్మాణానికే 10 లక్షలు
పల్లె ప్రక్రుతి వనానికి 4 లక్షల 23 వేల 7 వందలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఒక్క గద్వాల నియోజకవర్గం 44 రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలున్నయ్. వాటి కోసం దాదాపు 10 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చుఈ నియోజకవర్గంలో ఒక్కో స్మశాన వాటిక నిర్మాణానికి 11 లక్షల 13 వేల 7 వందల రూపాయలు ఇచ్చింది.,
ఒక్కో డంప్ యార్డ్ కు 2 లక్షల 50 వేల రూపాయలు…. నర్సరీకి ఒక లక్షా 56 వేల 314 రూపాయలు
ఈ నియోజకవర్గంలో దాదాపు 32 వేల టాయిలెట్లను కట్టించింది కేంద్రమే. ఒక్క గద్వాల్ మండలంలోనే 10 వేల మందికి ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ 500 ఇండ్లు మంజూరైనయ్. 7 కోట్ల 20 లక్షల రూపాయలు కేంద్రమిచ్చింది. ఒక్కటి కూడా కట్టలే.
ఖమ్మంలో బిజెపి కార్యకర్త సాయి గణేష్ ధర్మం కోసం పోరాడుతుంటే,… స్థానిక మంత్రి అవినీతి, అక్రమాలను సోషల్ మీడియాలో సమాజానికి తెలిసేలా చేస్తుంటే…, అక్రమంగా 16 కేసులు బనాయించి ఆత్మహత్య చేసుకునేలా వేధించారు.
నా సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రిని, పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అరాచకాలే. హత్యా రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే.