– విభజన బిల్లు అమలులో కాంగ్రెస్, బీజేపీ విఫలం
– మేం ప్రత్యామ్నాయం సూచించినా వారు పట్టించుకోలేదు
– మాజీ ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్: శాసనసభ సీట్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 26 లో పొందుపరచిన విధంగా పెంచాలి. కానీ కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదు దాన్ని ఆదేశించాలని చెప్పి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. వారు వేసిన కేసులో జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర విభజన జరిగి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తదనంతరం ఆ జమ్ము కాశ్మీర్లో సీట్లు పెంచారు.
ఆ విధంగానే తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సీట్లు పెంచాలని వేసినటువంటి కేసును సుప్రీంకోర్టు సుదీర్ఘంగా తీర్పు ఇచ్చి తిరస్కరించడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు తీరస్కరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరగదు, సీట్ల పెంపకం జరగదేమో అని చాలామంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో సెక్షన్ 26 లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో subjective provision article 170, sub laws 3 లో పొందుపరిచారు. Article 170 sub clause 3 ప్రకారం 2026 తర్వాత జరిగేటు వంటి జనగనన దృష్టిలో పెట్టుకొని డీ లిమిటేషన్ జరగాలి అని రాజ్యాంగం లో ఉంది. కమిటీ 2026 చాలా దూరంలో లేదు వచ్చే సంవత్సరమే 2026.
కాబట్టి 2026 తర్వాత జరిగే జనగణన తరువాత డీ లిమిటేషన్ జరుగుతుంది కాబట్టి అప్పుడు తప్పనిసరిగా సెక్షన్ 26 అమలు జరుగుతుంది. ఈ తీర్పు చాలా ఆలస్యంగా వచ్చింది. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, మేమందరం అప్పుడు ఎంపీలుగా ప్రధాన మంత్రి మోడీని కలిసి చెప్పాము.
సెక్షన్ లో కొంత తప్పిదం జరిగింది, subject to అనే పదాన్ని తొలగించి not with standing అనే పదం ఉంటే మీరు రాజ్యాంగ సవరణ చేసుకోకుండానే, ఈ విభజన చట్టం సరిపోతుందని మేము ఎన్ని సార్లు చెప్పినా కూడా మోడీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. కాబట్టి ఆలస్యం అయిపోయింది ఎప్పుడో జరగాల్సింది జరగలేదు.
కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర విభజన చట్టాన్ని బిల్లు రూపంలో పెట్టినప్పుడు ఈ తప్పిదం ఉందని ఆరోజు కూడా వారి దృష్టికి తీసుకు వచ్చాం. కానీ వారు కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆరోజు బిల్లులో not with standing పదానికి బదులు subject toఅనే సరికే ఈ సమస్య అంత వచ్చింది.
ఏది ఏమైనా కూడా 10 సంవత్సరాలు అయిపొయింది. తప్పకుండా 2026 తర్వాత సెన్సస్ జరుగుతుంది. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది . 1 మార్చ్ 2027 నాడు ప్రారంభమై అయిదు మాసాల్లోపే కంప్లీట్ అయిపోతుంది. 2028 లో జరగబోయే మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు 2029లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో డిలీమిటేషన్ జరుగుతది. కేంద్ర ప్రభుత్వం సీట్ల పెంపకం చేయక తప్పదు.
ఈ తీర్పు వల్ల జమ్మూ కాశ్మీర్లో పెంచిన్రు. తెలుగు రాష్ట్రాల్లో పెంచలేదు అనేదానిపైనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి, దానికి union territories, ఇవి రాష్ట్రాలు కాబట్టి article 170 జమ్ము కాశ్మీర్ కి వర్తించదు కాబట్టి ఈ 26 పేజీల తీర్పు ఇచ్చారు. 2026 లో జరిగే సెన్సెస్ మరియు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సీట్ల పెంపకం జరగక తప్పదు.
మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వచ్చింది. దాంట్లో కూడా చట్టం 5లో జనగణన జరిగిన వెంటనే మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది . ఇప్పటికే రాజ్యసభ, లోక్ సభ పాస్ చేసింది. రాష్ట్రపతి దాన్ని ఆమోదించారు. 2026 లో జరగబోయే సెన్సస్ తర్వాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది ,డిలీమిటేషన్ జరుగుతుంది.