Suryaa.co.in

Telangana

కేసీఆర్ దెబ్బకు, బి ఆర్ ఎస్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది

-ఇది కేసీఆర్ విజయం, ఇది బి ఆర్ ఎస్ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం
-విశాఖ ఉక్కును అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నరు
– వికారాబాద్ మర్పెల్లి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు

విశాఖ హక్కు గురించి కేసీఆర్, కేటీఆర్ , నేను మాట్లాడాం.ఏమన్నాము.. విశాఖ ఉక్కును అడ్డికి పావు షేరు లెక్క అమ్ముతున్నరు, 27 వేల మంది కార్మికులకు అన్యాయం చేస్తున్నరు అన్నము. దాన్ని కాపాడడం కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ దెబ్బకు, బి ఆర్ ఎస్ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గింది. కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించాడు. బలోపేతం చేస్తాం అన్నడు. అక్కడి రెండు పార్టీలు నోరు మూసుకున్నా, ప్రజలు, కార్మికులు, బి ఆర్ ఎస్ పోరాటం చేసింది.అధికార పక్షం నోరు మూసుకున్నా, ప్రతి పక్షం ప్రశ్నించకపోయినా ప్రజలు, బిఆర్ఎస్ పోరాటం చేసింది. అందుకే కేంద్రం దిగి వచ్చింది, అయినా జాగ్రత్తగా ఉంటాం. కేంద్రం పై పోరాటం కొనసాగిస్తాం.

ఇది కేసీఆర్ విజయం, ఇది బి ఆర్ ఎస్ విజయం, ఇది ఏపీ ప్రజల విజయం, నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ కార్మికుల విజయం. ఏపీ ప్రజలకు, కార్మికులకు అభినందనలు, శుభాకాంక్షలు. అన్యాయానికి వ్యతిరేకంగా గులాబీ జెండా పోరాటం చేస్తుంది. అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE