– టీడీపీ కూడా ముఖ్యమంత్రి సాగిస్తున్న మద్యం నాటు సారా వ్యాపారాలపై న్యాయస్థానాలను ఆశ్రయించబోతోంది
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాననిషేధం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రై మూడేళ్లవుతున్నా మద్యం నియంత్రణకు ఎలాంటిచర్యలు తీసుకోకపోవడం ముమ్మాటికీ ముఖ్యమంత్రి అవలం భిస్తున్న సిగ్గుమాలిన చర్యగానే చెప్పొచ్చని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు తెలిపారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
రాష్ట్రంలో మద్యం మహమ్మారిని పెంచి పోషిస్తూ, ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ, తమ ఖజానా నింపుకుంటున్న పాలకులదుర్మార్గాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని కోరుతున్నాం. మద్యపాననిషేధం పేరుతో ముఖ్యమంత్రి, ఆయన పార్టీవారే యథేచ్చగా మద్యం, నాటుసారా, ఇతరమాదకద్రవ్యాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాల చెలగాట మాడుతూ, ఏటా 16,500కోట్లవరకు దోచుకుంటున్నారు. దాన్ని ఈఏడాది రూ.20వే లకోట్లకు పెంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే లక్ష్యాలు నిర్దేశించాడు.
చంద్రబాబునాయుడి హాయాంలో మద్యంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.6వేలకోట్లుగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అధికారులకు లక్ష్యాలువిధించి మరీ మద్యంఅమ్మకాలు జరిపి స్తున్నాడు. మద్యంపైవచ్చే ఆదాయాన్ని రాబోయే 20ఏళ్లపాటు తాకట్టుపెట్టిమరీ రూ.25వేలకోట్లవరకు అప్పులుతెచ్చాడు. టీడీపీహాయాం లో రూ.60నుంచి రూ.70వరకు అమ్మిన చీప్ లిక్కర్ ఈ ముఖ్యమంత్రి రూ.250 నుంచి రూ.270వరకు విక్రయిస్తున్నాడు.
దేశంలోఎక్కడాలేని పిచ్చిబ్రాండ్ల మద్యాన్ని జగన్ బ్రాండ్స్ పేరుతో రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యంతాగి ప్రజలు ప్రాణాలతోపాటు ఆస్తులు కూడా కోల్పోతున్నారు.పిచ్చి మద్యం తాగిన వారిలో విపరీతమైన లక్షణా లుకనిపిస్తున్నాయని ఆసుపత్రుల వర్గాలేచెబుతున్నాయి.40 ఏళ్లక్రితమే రాష్ట్రంలో మాయమైన నాటుసారా విక్రయాలను మరలా ఈ ముఖ్యమంత్రి ప్రారంభించారు. తనపార్టీవారికి నాటుసారా విక్రయాలను ముఖ్యమంత్రి ఒకకుటీరపరిశ్రమగా మార్చాడు. ఇటీవలే జంగారెడ్డిగూడెం లో దాదాపు 40మందివరకు నాటుసారాతాగి మరణించారు.
నాటుసారామరణాలన్నీ సహజమరణాలని అసెంబ్లీసాక్షిగా ముఖ్యమంత్రే నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెప్పాడు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో నాటుసారార మరణాలుకాదు..సహజమరణాలని చెప్పినప్పుడే, మద్యం తయారీవిక్రయాలకట్టడికి ముఖ్యమంత్రే స్వయంగా నియమించిన ఎస్ఈబీ (సెబ్) వారు నాటుసారావిక్రయిస్తున్నవారితోపాటు, తయారీదా రులను అరెస్ట్ చేసి కేసులు నమోదుచేశారు. దాదాపు 12ఎఫ్ఐఆర్ లు నమోదుచేసి, ఒక్కరోజులోనే22 మందిని అరెస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి చెప్పినట్లుగా అవన్నీ సహజ మరణాలే అయితే ఎస్ఈబీ వారు కేసులు ఎందుకు నమోదు చేశారు…నిందితులను ఎందుకు అరెస్ట్ చేశారు. నాటుసారా తాగిమరణించిన వారి పోస్ట్ మార్టమ్ నివేదికలుపరిశీలిస్తే వారంతా కల్తీసారాతాగే చనిపోయారని స్వయంగా వైద్యులేచెప్పినట్టు రూఢీఅయ్యింది. వైద్యులనివేదికలు, ఎస్ఈబీవారి ఎఫ్ఐఆర్ లు.. వారు నమోదుచేసిన కేసులు అన్నీ అబద్దాలు..తానుచెప్పేదే నిజమన్నట్లుగా ముఖ్యమంత్రి కట్టుకథలు అల్లాడు.
నాటుసారాదెబ్బకు వేలాదికుటుంబా లుఅన్నివిధాల నష్టపోతున్నా ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వం స్పందించ డంలేదు. రాష్ట్రంలో అమ్ముతున్న పిచ్చిమద్యంఅంతా జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీలు, ప్రభుత్వపెద్దల డిస్టిలరీకంపెనీలనుంచే తయారవుతు న్నది. మంచిమంచి బ్రాండ్ల మద్యం అమ్మకాలు అనేవి రాష్ట్రంలో ఎక్కడా లేకుండాచేసిన ముఖ్యమంత్రి, ఆఖరికి మద్యందుకాణాల్లో నగదుచెల్లిం పులు తప్ప, ఇతరత్రా డిజిటల్ కార్డు చెల్లింపులను పూర్తిగా ఎత్తేశారు.
జే బ్రాండ్లు అమ్మడంద్వారా వచ్చే ఆదాయమంతా సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కు చేరవేయడానికే మద్యందుకాణాల్లో నగదుచెల్లింపులను అను మతిస్తున్నారు. నాటుసారామరణాలపై కేంద్రప్రభుత్వం తక్షణమే దృష్టిసారించి, న్యాయవిచారణకుఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. అలానేసారా వల్ల సంభవించిన మరణాలపై ఎయిమ్స్ వంటిసంస్థతో విచారణజరిపించి, అసలువారంతా ఎందుకు చనిపోయారనేదికూడా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజే స్వయంగా రాష్ట్రంలో అమ్ముతున్న కల్తీమద్యాన్ని ల్యాబ్ లలో పరీక్షలకు పంపితే విస్తుగొలిపే అంశాలు బట్టబయలుఅయ్యాయి. కాబట్టి కేంద్రం వెంటనే ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ ఖజానానింపుకుంటున్న రాష్ట్ర పాలకుల ఆటకట్టించాలని కోరుతున్నాం. జేబ్రాండ్స్ మద్యంఅమ్మకాలు.. నాటుసారా విక్రయాలపై మావద్ద ఉన్నసమాచారంతో మేంకూడా న్యాయ స్థానాలను ఆశ్రయించడానికి సిద్ధంగాఉన్నాము.