- ప్రొఫెసర్ జోసఫ్ మూసిగంటి జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్
– ఆంధ్రప్రదేశ్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి
చేబ్రోలు: భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ కులాలకి సంపూర్ణ మత స్వేచ్ఛ 75 సంవత్సరాలుగా లేదు. మిగతా అన్ని ఎస్టీ, బీసీ, ఓసీ కులాలకు భారతదేశంలో సంపూర్ణమత స్వేచ్ఛ ఉన్నది. ఆగస్టు పది,1950 లో షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఎక్కువ శాతం పేదలైన షెడ్యూల్ క్యాస్ట్ కులాల వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ తీసివేశారని జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
క్రైస్తవులు ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డే గా గుర్తించి నిరసన తెలియజేస్తారు. గత 75 సంవత్సరాలుగా షెడ్యూల్ క్యాస్ట్ కులాలవారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాట ఫలితంగా 1950లో సిక్కు మతంలోకి మారిన వారికి, 1990 సంవత్సరంలో బౌద్ధమతం లోకి మారిన ఎస్సీ రిజర్వేషన్ పోకుండా రాజ్యాంగంలో సవరణ చేశారు. కానీ క్రైస్తవ మతం గాని, ముస్లిం మతంలోకి గాని మారిన షెడ్యూల్ క్యాస్ట్ కులాల వారికి మాత్రమే గత 75 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు.
పోరాటంలో భాగంగా న్యాయస్థానంలో అనేక కేసులు వేసినప్పటికీ ఫలితం లేకపోయింది, 2004లో కేసు వేసినప్పుడు, భారత ప్రభుత్వం దీని మీద అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వడానికి అక్టోబర్ 29 2004లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. షెడ్యూల్ కులాల వారికి మతంతో సంబంధం లేకుండా వారికి రిజర్వేషన్ కల్పించాలని, 2007లో రంగనాథ్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. రిపోర్టులో ముఖ్యమైన విషయాలలో దళిత క్రైస్తవులు హిందూ డామినేటెడ్ సొసైటీ నుంచి డిస్క్రిమినేషన్ ఎదుర్కోవడమే కాకుండా, సొంత మతంలోని ఉన్నత కులాల వారి నుంచి నుంచి కూడా డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారని, షెడ్యూల్ కులాల వారు కాస్ట్ క్రైస్తవ మతంలో గాని ముస్లిం మతంలో గాని మారినందువల్ల షెడ్యూల్ క్యాస్ట్ నుంచి దూరం చేస్తే అది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు సమానత్వం కి వ్యతిరేకం అవుతుందని, వారికి రిజర్వేషన్ దూరం చేయటం వలన సామాజికపరంగానూ విద్యాపరంగానూ వెనుకబడి పోతారని ఇది ఆర్టికల్ 16 కు వ్యతిరేకమని సూచించింది.
కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు, మరలా దళిత క్రైస్తవుల కేసు 2023లో బెంచ్ మీదకు రాగా ఇప్పుడున్న ప్రభుత్వం రంగనాథ్ మిశ్రా ఇచ్చిన రిపోర్ట్ అంగీకారం కాదని, మరొక కమిషన్ మేం ఏర్పాటు చేస్తామని కేజీ బాలకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసింది. కన్వర్ట్ అయిన క్రైస్తవుల స్థితిగతులు పరిశీలించమని, షెడ్యూల్ కులం లో ఉన్న అంటరానితనాన్ని తప్పించుకొనుటకు మతంమారిన వారికి రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. క్రైస్తవ, ముస్లిం మతంలో కులాలు లేవని, కులాలకు ఉండే రిజర్వేషన్ వారికి కల్పించవులేమని వాదన లేవదీసింది.
క్రైస్తవ మతంలోనికి మారిన వారు అనేక కులాలవారు ఉంటారని వారందరినీ షెడ్యూల్ క్యాస్ట్ లిస్టులో చేర్చలేమని కోర్టుకు తెలిపింది. అయినా కోర్టు సూచన మేరకు కొత్త కమిషన్ బాలకృష్ణ నియమిస్తున్నామని, కమిషన్ రిపోర్ట్ ప్రకారం కోర్టు వారు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. క్రైస్తవత్వం లో కులం లేదు కనుక రిజర్వేషన్లు అక్కర్లేదు అంటున్నారు. కులం వదులుకున్న వారు హిందూ మతంలో ఉంటారు, క్రైస్తవ మతంలో ఉంటారు, అన్ని మతాల్లోనూ ఉంటారు, కులం పట్టించుకునే వాళ్ళు, కులం చూసి, సొంత కులం అయితేనే పెళ్లిళ్లు చేసుకునే వాళ్ళు క్రైస్తవ మతాలలోనూ ఉంటారు.
ఉన్నత కుల క్రైస్తవులు, దళిత క్రైస్తవుల్ని పెళ్లి చేసుకోకుండా, ఉన్నత కులాల వారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవారు క్రైస్తవులలోనూ ఉన్నారు. అందరికీ సంపూర్ణ మత స్వేచ్ఛ, ఉన్నట్టే షెడ్యూల్ క్యాస్ట్ వారికి కూడా సంపూర్ణ మత స్వేచ్ఛ ప్రభుత్వాలు కల్పించాలని ఆయన కోరారు. అంటరానితనం హిందూమతంలోనే ఉన్నది గనుక హిందూ మతం వారికే రిజర్వేషన్లు అనటం సరికాదు ఎందుకంటే, అంటరాని వారిగా చూసేవారు, మతం మారినా కులం మారలేదు కాబట్టి క్రైస్తవ మతంలోనికి మారిన వారిని అంటరాని వారిగానే చూస్తున్నారు.
“దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా” బదులుగా “షెడ్యూల్ కులాల వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ కావాలి” అని ఉపయోగిస్తే బాగుంటుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలి అని రాంగ్ టైటిల్ పెట్టారు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలి అంటే దీని అర్థం “దళిత్” అనే పదానికి డెఫినేషన్ లేదు. రాజ్యాంగంలో ఏ కులాలు వారిని దళితులుగా పేర్కొన్నారో డెఫినిషన్ లేదు, 56 సభకులాలవారు వారిని షెడ్యూల్ కులాలుగా రాజ్యాంగం గుర్తించింది.
దళిత అనే పదం కంటే షెడ్యూల్ కులాలు అనే పదం అందరికీ అర్థమయ్యేదిగా ఉంటుంది. రాంగ్ టైటిల్ అర్థం , దళిత్ కులాలను షెడ్యూల్ కులాల లిస్టులో చేర్చాలి అని అర్థం వస్తుంది. అందుకే ప్రభుత్వాలు కూడా దీనిని ఉపయోగించుకొని వారి స్థితిగతులను అధ్యయనం చేసి దళిత్ కులాలను షెడ్యూల్ కులాలు లిస్టులో కలపాలా వద్దా అని వ్యాఖ్యానిస్తున్నారు. నేను ఈరోజు ఎస్సీ హిందువుగా ఉన్నాను రేపు ఏసుప్రభు మీద నమ్మకం వచ్చి క్రిస్టియన్ గా మారితే నా సామాజిక ఆర్థిక పరిస్థితి ఏం మారుతుంది.
బలవంతంగా ఎవరు మతంనైనా మార్చగలమా, అలానే మతం మారకుండా ఆంక్షలు పెట్టి బలవంతంగా ఎవరినైనా ఆపగలమా అలా జరిగితే ఆ పరిస్థితులు దేనికి దారితీస్తాయని ఆయన ప్రశ్నించారు. ఎస్టి, బీసీ, ఓసీలు ఎవరైనా ఏ మతానికైనా మారవచ్చు. వారికున్న రిజర్వేషన్ కానీ బెనిఫిట్స్ గాని పోవు, కానీ ఒక్క షెడ్యూల్ కులంలో వారు మారితే వారి 15% రిజర్వేషన్ పోయి 1% రిజర్వేషన్ గల బీసీ-సీ కేటగిరీకి నెట్టు వేయబడతారు. ఎవరికీ లేని ఆంక్షలు ఒక్క షెడ్యూల్ కులముల వారికే ఎందుకు? వారు మతం మారాలన్న వాళ్ల పేద స్థితిని బట్టి రిజర్వేషన్లు వదిలేసి మారలేక, మానసిక శోభకు గురవుతున్నారని జోసెఫ్ తెలిపారు.
కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వీరు క్రైస్తవులు. వీరి రిజర్వేషన్ తీసేయండి అని కంప్లైంట్ లు పెట్టి సెల్ఫ్ డిక్కలరేషన్ కాకుండా వేరే వాళ్ళు క్రైస్తవులుగా డిక్లేర్ చేస్తున్నారు, చర్చికి వెళ్లినంత మాత్రాన వారు క్రైస్తవులు అయిపోతారా, వారికి విశ్వాసం వస్తే వారే డిక్లేర్ చేసుకుంటారు కదా, చర్చికి క్రైస్తవులే కాకుండా ఏ కులం వారైనా, ఏ మతం వారైనా రావచ్చు. క్రైస్తవులు భారతదేశానికి, ఆయా రాష్ట్రాలకి, తమ తమ ప్రదేశాలలో ఎంతో సేవ చేసే చేస్తారు. భారతదేశంలో మత సామర్థ్యం దెబ్బ తినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనిది నరేంద్ర మోడీ షెడ్యూల్ కులాల వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని ప్రొఫెసర్ జోసెఫ్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి రాష్ట్ర అసెంబ్లీలో షెడ్యూల్ క్యాస్ట్ కులాల వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు