– బాబాయ్ హత్యకేసులో మరోబాబాయ్ ని, తమ్ముడిని కాపాడాలన్న ముఖ్యమంత్రి భగీరథప్రయత్నాలు విఫలమయ్యాయి
– తనవాళ్లను కాపాడతాయి అనుకున్నజగన్ అధికారం, అహం, బింకాలు అన్నీ పటాపంచలు అయ్యాయి
– వివేకా హత్యకేసు ఉచ్చునుంచి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి లను కాపాడటానికి ముఖ్యమంత్రి లాబీయిస్ట్ లను రంగంలోకి దింపాడు
• నిన్న జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి రాజప్రాసాదంలో లాబీయిస్ట్ విజయ్ కుమార్, ప్రముఖకాంట్రాక్టర్ కుమారుడు శశిధర్ సమావేశమయ్యారు
• ముఖ్యమంత్రి వారితోఏంచర్చించారు? వారు మైసూర్ నుంచి ప్రత్యేకవిమానంలో గన్నవరం వచ్చి, ముఖ్యమంత్రి ఇంటికెళ్లారు. ముఖ్యమంత్రితో సమావేశానంతరం నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు
• ముఖ్యమంత్రితో నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5.30నిమిషాల వరకు సమావేశమయ్యారు
• జగన్మోహన్ రెడ్డి లాబీయిస్ట్ విజయ్ కుమార్ కు ఏంపని అప్పగించారో, గంటలకొద్దీ వారితో ఏం మాట్లాడారో ప్రజలకు చెప్పాలి
• వివేకాహత్యజరిగిన రోజురాత్రి అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డితో ఏంమాట్లాడారో తేలాలి
• త్వరలోనే ఈ కేసులో ముఖ్యమంత్రి దంపతులకు కూడా సీబీఐ నోటీసులువస్తాయి
• వివేకానందరెడ్డిని ఎవరుచంపారో ముఖ్యమంత్రికి ఆనాడే తెలుసు. తొలిరోజు నుంచీ తాము ఇదేచెబుతున్నాం, తెలుసుకోవడానికి సీబీఐకే సమయం పట్టింది
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రప్రజలు ఎండలబాధతో వేడేక్కుతుంటే, తాడేపల్లి రాజప్రాసాదం కుటుంబసభ్యుల అరెస్ట్ తో వేడివేడిగా ఉందని, తన అధికారం, అహం, అంగబలం, ఆర్థికబలంతో హత్యచేసిన వారిని రక్షించవచ్చని భావించిన జగన్, ఆయన అహం, బింకాలు వై.ఎస్.భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో పటాపంచలు అయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి చనిపోయారు. మరోబాబాయ్ భాస్కర్ రెడ్డి, ఇది వరకు జగన్ ఉన్న చంచల్ గూడజైల్లో ఉన్నారు. వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్.అవినాశ్ రెడ్డిల ను రక్షించడానికి, వారు అరెస్ట్ కాకుండా చూడటానికే జగన్ తలకిందులుగా తపస్సు చేసి, భగీరథప్రయత్నాలు చేశారు. చట్టంచాలా బలమైనది.. దాని పని అదిచేస్తుంది.. తన తమ్ము డు, బాబాయ్ కోర్టులో నిర్దోషులుగా బయటకు వస్తారని జగన్ భావించలేదు. ఢిల్లీ యాత్రలతో ఫలం దక్కలేదని భావించిన జగన్ చివరకు, తనవాళ్లను రక్షించుకోవడానికి దిగ్రేట్ లాబీయి స్ట్ విజయ్ కుమార్ ను రంగంలోకి దించారు.
ఎవరీ లాబీయిస్ట్ విజయ్ కుమార్… నిన్న అతను జగన్మోహన్ రెడ్డితో సమావేశమై ఏం చర్చించారు?
వాస్తుశాస్త్రం, హస్తసాముద్రికంలో నిష్ణాతుడైన విజయ్ కుమార్ కు కొంతమంది పెద్దలతో పరి చయాలున్నాయి. ఢిల్లీ, ఇతరరాష్ట్రాల్లోని పెద్దపెద్దతలకాయలతో తనకున్న పరిచయాలతో వి జయ్ కుమార్ లాబీయింగ్ చేస్తుంటారని, రాజీలు చేస్తారని, తిమ్మినిబమ్మిని బమ్మిని తిమ్మి ని చేస్తారని చెప్పుకుంటున్నారు. అలాంటి సీఎం విజయ్ కుమార్ నిన్నఉదయం 10.30 నిమిషాలకి, మైసూర్ విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో సీ.శశిధర్ (ఆంధ్రాకుచెందిన ప్రముఖకాంట్రాక్టర్ కుమారుడు) హెచ్.పీ.బసవరాజు, సతీశ్ లతో కలిసి గన్నవరం విమానాశ్ర యానికి వచ్చారు. వారు11.40కి విమానాశ్రయానికి వచ్చేటప్పటికి వారి కోసం ప్రత్యేకంగా ఒకకారు సిద్ధంగా ఉంది. ఆకారుతో పాటు మరో పోలీస్ పైలట్ వాహనం కూడా సిద్ధంగా ఉంది. విమానాశ్రయానికి వచ్చాక వారికోసం సిద్ధంగా ఉంచిన ప్రత్యేక కారులో లాబీయిస్ట్ విజయ్ కుమార్, శశిధర్ లు మాత్ర మే తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. వారు ముఖ్యమంత్రి ఇంటికివెళ్లిన కారు నంబర్ కూడా సక్రమంగా కనీకనిపించకుండా ఉందని చెప్పారు.
ఆ కారు ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి నివాసానికి చేరింది. వారు నేరుగా ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్లిపోయి, సాయంత్రం 5.30నిమిషాలవరకు అక్కడే ఉన్నారు. అక్కడే భోజనం కూడా చేశారు. సాయంత్రం 5.30నిమిషాలతర్వాత ఆ ఇద్దరూ ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. అక్కడనుంచి వారువచ్చిన ప్రత్యేక విమానంలో తిరిగి రాత్రి 7.00గంటలకు హైదరాబాద్ వెళ్లిపోయారు. మైసూర్ నుంచి వచ్చినవారు అక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ వెళ్లడమేంటి? విజయ్ కుమార్, శశిధర్ లతో ముఖ్యమంత్రి సమావేశమైన సమయంలో ఏ అధికారి, మంత్రి కూడా లోనికి వెళ్లింది లేదు. (కావాలంటే రికార్డులు చెక్ చేసుకోండి). విజయ్ కుమార్, శశిధర్ లు ముఖ్యమంత్రితో ఏం మాట్లాడారు. వారు ముఖ్యమంత్రిని ఏం కోరికలు కోరారో తెలియాలి. తనబాబాయ్, తన తమ్ముడు రిమాండ్ కువెళ్లకుండా చూడాలని, రిమాండ్ కు వెళ్తే ఏదోరకంగా బెయిల్ ఇప్పించాలని ముఖ్యమంత్రి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ తో చెప్పారా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశానంతరం మరలా విజయ్ కుమార్, శశిధర్ లు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. మైసూర్ నుంచి వచ్చినవారు, తిరిగి అక్కడికి వెళ్లకుండా, హైదరాబాద్ లో దిగి తమకార్యాచరణ మొదలెట్టారు. విజయ్ కుమార్ బృహత్తర కార్యక్రమం వై.ఎస్.భాస్కర్ రెడ్డిని బయటకు తీసుకురావడమే. వైఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలను రక్షించడానికే జగన్మోహన్ రెడ్డి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ ను రంగంలోకి దించారు. కాదని ముఖ్యమంత్రి చెప్పగలరా? ముఖ్యమంత్రి లాబీయిస్ట్ విజయ్ కుమార్ తో సమావేశమైంది రాష్ట్ర భవిష్యత్ కోసమా..లేక ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసమా?
వివేకా హత్యకేసులో వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు రిమాండ్ కు వెళ్తారని జగన్ కు ముందే తెలుసు
వివేకాహత్యకేసులో వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి రిమాండ్ కు వెళ్తారని ముఖ్యమంత్రికి ముందే తెలుసు. ఎందుకంటే తనబాబా య్ వివేకానందరెడ్డిని చంపిన ఘటనలో భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలే ప్రధానసూత్రధారులు. లేకపోతే హత్యజరిగినరోజు అర్థరాత్రి అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసి, జగన్ తో ఏం మాట్లాడాడు? భారతిరెడ్డి అటెండర్ నవీన్ కి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు. ఏంమాట్లాడారు? వివేకాహత్యను తన రాజకీయలబ్ధికి వాడుకొని ప్రజల్ని ఏమార్చి, సానుభూతితో జగన్ లబ్ధిపొందాడు అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? సానుభూతి కోసం, రాజకీయలబ్ధికోసం ముఖ్యమంత్రి ఏమైనా చేస్తాడు.
విజయ్ కుమార్ తో తానేం మాట్లాడింది, ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు బహిర్గతం చేయాలి. లాబీయిస్ట్ విజయ్ కుమార్, అతన్ని నడిపిస్తున్న అవినీతి, అధికారప్రతిరూపాలైన పెద్దల ఉచ్చులో పడకుండా వివేకాహత్యకేసు విచారణలోని పెద్దలు, ప్రముఖులు అప్రమత్తంగా ఉండాలి
ఈ వ్యవహారంలో లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఇప్పుడేం చేయబోతున్నారు? జగన్ తరుపున వివేకాహత్యకేసు వ్యవహారంలో తలదూర్చిన లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఏక్షణంలో ఎవరినైనా కలవొచ్చు. హత్యకేసు విచారణలో భాగస్వాములైన అధికారుల్ని, వారిపై అధికారుల్ని కలవొచ్చు. వారంతా విజయ్ కుమార్ లాంటివారిని దరిచేరనీయకుండా, వివేకాహత్య కేసు విచారణ సక్రమంగా పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రిని కలిసిన శశిధర్ తండ్రికే ద్రోహం చేసిన దుర్మార్గుడు. ఉచ్ఛనీచాలు తెలియనివాడు, ఏదిమంచో ఏదిచెడో తెలియని మనిషి. అలాంటి వారంతా కలిసి జగన్మోహన్ రెడ్డి కార్యాన్ని చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు. అన్నీదారులు మూసుకుపోయాక లాబీయిస్ట్ లను రంగంలోకి దించినా ఉపయోగంలేదని భారతదేశ న్యాయవ్యవస్థ, దర్యాప్తుసంస్థ సీబీఐ ఇంకా తాను అనుకునే స్థితికి దిగజారలేదని ముఖ్యమంత్రి గ్రహించాలి. జగన్ కు దేవుడిచ్చిన అన్నయ్య అయిన గాలిజనార్థన్ రెడ్డి గతంలో బెయిల్ పొందడానికి సీబీఐ జడ్జికి రూ.100కోట్ల లంచం ఇచ్చి పట్టుబడ్డాడు. ఆ వ్యవహారంలో సీబీఐ జడ్జి పట్టాభిరామారావు బలయ్యారు.
అదే కోవలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, లాబీయిస్ట్ విజయ్ కుమార్ ద్వారా ఎవరిని బలిచేయబో తున్నాడు. వివేకాహత్యకేసుని విచారిస్తున్న పెద్దలు, అధికారులు అధికారం, అవినీతి ప్రతిరూపాలైన పెద్దలమాయలోపడకుండా లాబీయిస్ట్ విజయ్ కుమార్ ఉచ్చులో పడకుం డా, అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ఇలాంటి పనులు చేయడానికేనా జగన్మోహన్ రెడ్డిని, ఆయనపార్టీని గెలిపించి ప్రజలు ముఖ్యమంత్రిని చేసింది? విజయ్ కుమార్ ఎవరో, తనఇంటికి వచ్చి ఏం మాట్లాడారో ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు చెప్పాలి. విజయ్ కుమార్ కు ముఖ్యమంత్రి ఏంపని అప్పగించారు.. ఎవరిని మేనేజ్ చేయమని చెప్పారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డితీరు, ఆలోచనావిధానం ఎలాఉంటుందో ఇప్పటికైనా ప్రజలుఆలోచించాలి. లాబీయిస్ట్ లతో తానెందుకు సమావేశమైంది ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టకపోతే, హంతకుల్ని కాపాడటానికే ఆయన పదవిలో ఉన్నారని ప్రజానీకం భావించాల్సి వస్తుంది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీకి ఫోన్ చేసి, జగన్ తో, ఆయన సతీమణి భారతిరెడ్డి అటెండర్ కి ఫోన్ చేసి ఆమెతో ఏం మాట్లాడారనేది కూడా తేలాలి. త్వరలోనే ఈ కేసులో ముఖ్యమంత్రి దంపతులకు కూడా సీబీఐ నోటీసులువస్తాయి.
అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడటానికి ముఖ్యమంత్రి ఎ న్నో సార్లు ఢిల్లీకి వెళ్లారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే, ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వెళ్లాడు. అర్థరాత్రి, అపరాత్రి అనిలేకుండా ప్రత్యేకవిమానాల్లో పరుగులు తీశాడు. ఎన్ని చేసినా, ఎంతచేసినా భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ల అరెస్ట్ ను ముఖ్యమంత్రి ఆపలేడని తా ము ఇదివరకే చెప్పినట్టే జరిగింది. ప్రజలందరి చూపు ఇప్పుడు తాడేపల్లి రాజప్రాసాదం వైపే ఉంది. మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యలు ఆయనకే చేటుచేయబోతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి అన్నవెంటనే, సజ్జల స్పందించాడు. దానివల్లే రేపోమాపో సురేశ్ మంత్రి పదవి ఊడనుంది” అని రామయ్య స్పష్టంచేశారు.