పనికిమాలిన సలహాదారుల వ్యవస్థవల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఒరిగిందో ముఖ్యమంత్రి చెప్పాలి
• ఫోన్ ట్యాపింగ్, సెటిల్మెంట్లు, దందాలు, దోపిడీతప్ప, పనికిమాలిన సలహాదారుల వ్యవస్థవల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఒరిగిందో ముఖ్యమంత్రి చెప్పాలి
• సలహాదారుల పనితీరుపై పూర్తివాస్తవాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి
• సెటిల్మెంట్లు, దందాలు, ప్రజాసొమ్ము దోపిడీకోసమే జగన్ రెడ్డి సలహాదారుల్ని నియమించాడు
• ప్రభుత్వం నియమించిన సలహాదారుల్ని చూసి దేశ అత్యున్నత న్యాయస్థానమే నివ్వెరపోయింది
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
రాజకీయ నిరుద్యోగుల్ని, సాక్షిమీడియా తీసేసిన వారిని జగన్ రెడ్డి సలహాదారులుగా నియ మించాడని, వారంతా సెటిల్మెంట్లు, దందాలతో, ప్రజాధనాన్ని దోపిడీచేస్తున్నారని, వారి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఒనగూరిందో ముఖ్యమంత్రి చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యు లు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
“జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు పనికిరాని రాజకీయ నిరుద్యోగుల్ని సలహాదా రులుగా నియమించాడు. సెటిల్మెంట్లు, దందాలుచేయడానికి, ప్రజలసొమ్ము దోచుకోవ డానికే వారిని నియమించాడు. దోపిడీతో ఆగకుండా ఇప్పుడు ఆ సలహాదారులు ఎవరిఫోన్లు ట్యాప్ చేయాలి.. ఎవరి ఆస్తుల్ని సెటిల్మెంట్లపేరుతో కొట్టేయాలి.. ఇసుక, లిక్కర్ మాఫియాల్లో కమిషన్లు ఎలా వసూలుచేయాలనే పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు ఎవరైనా వారు సలహాదారులుగా ఉన్నశాఖలకు పనికొచ్చే సలహాలు ఇన్నేళ్లలో ఒక్కటైనా ఇచ్చారా? వారిశాఖలు చూసే మంత్రులతో ఏనాడైనా ఆయాశాఖలపై జరిగే సమీక్షలో వారుపాల్గొన్నారా? శాఖలవారీగా తమదోపిడీని విస్తరిస్తూ, వారిజేబులు నింపుకుంటూ, ముఖ్యమంత్రి ఖజానా నింపే పనిలో సలహాదారులు ఉన్నారు.
పనికిమాలిన సలహాదారుల వ్యవస్థతో రాష్ట్రానికి, ప్రజలకు ఏం ఉపయోగమో ముఖ్యమంత్రి చెప్పాలి
పనికిమాలిన సలహాదారుల వ్యవస్థతో రాష్ట్రానికి ఏం ఉపయోగమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. తాను నియమించిన సలహాదారులు ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి సలహాలిచ్చారో, వాటివల్ల ఏం మేలుజరిగిందో ముఖ్యమంత్రి తక్షణమే శ్వేత పత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. సలహాదారుల వల్ల ప్రజలకు, రాష్ట్రాని కి పైసా ఉపయోగంలేదని సవాల్ చేసి చెబుతున్నాం… కాదని ముఖ్యమంత్రి చెప్పగ లడా? రాష్ట్రప్రభుత్వ సలహాదారుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానమే నివ్వెర పోయింది. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నిస్తే, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కళ్లు తేలేశాడు. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులున్నారో తెలియని దుస్థితిలో పాలకులు ఉన్నారు.
పరిపాలనలో ప్రధాన భూమిక పోషించడానికి ఐపీఎస్ అధికారులుండగా, ప్రభుత్వం దారినపోయేవాళ్లను సలహాదారులుగా ఎందుకు నియమించింది? ఎలాంటి అనుభవం, విషయ పరిజ్ఞానం ఉందని ప్రభుత్వం వారిని సలహాదారుల్నిచేసి, అడ్డగోలుగా లక్షల జీత భత్యాలు దోచిపెడుతోంది? సాక్షిమీడియా తీసేసిన వారందరనీ జగన్ రెడ్డి సలహా దారుల్ని చేశాడు. సలహాదారుల నియామకంలోకూడా జగన్ తనకున్న కులపిచ్చిని చాటుకు న్నాడు. అగ్రకుల అహంకారంతో సలహాదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాల మంత్రులపై పెత్తనం చేస్తున్నా ముఖ్యమంత్రి నోరెత్తడంలేదు.
అజయ్ కల్లం రెడ్డి, వాసుదేవరెడ్డి, పద్మజారెడ్డి, శ్రీనాధ్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గోవింద్ రెడ్డి, భరత్ రెడ్డి, వీరారెడ్డి, ధనుంజయ రెడ్డి, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి,ఆలూరి సాంబశివారెడ్డి, చల్లా సాంబశివారెడ్డి… ఎవరు వీళ్లంతా? వీళ్లందరికీ పెద్ద ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ధనుంజయరెడ్డి తీసేసిన తహసీ ల్దార్ లాం టోడు. సాక్షిలో నుంచి తీసేస్తే అతన్ని సలహాదారుగా నియమించారు. ఎవరో పీఠాధిప తి చెప్పాడని ప్రభుత్వం దేవాదాయశాఖకు సలహాదారుని నియమించడం తుగ్లక్ నిర్ణయమే” అని బొండా ఉమా ఎద్దేవాచేశారు.