: పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా
• జిల్లాలో వాహన మిత్ర లబ్దిదారులకు రూ. 11.59 కోట్లు జమ : జిల్లా కల్లెక్టర్
తిరుపతి, జూలై 15: గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేద వాళ్ళ కోసం ద్రుష్టి పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంతో నేడు వాహన మిత్ర ద్వారా రూ. 262 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని విశాఖపట్నం నుండి బటన్ నొక్కి ప్రారంభించడం మనం చూసామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీస్ లు క్రీడ శాఖ మాత్యులు ఆర్.కె. రోజా అన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో గౌరవ ముఖ్యమంత్రి విశాఖ నుండి ప్రారంభించిన వాహన మిత్ర కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించిన అనంతరం పర్యాటక శాఖ మంత్రి, ఎం.పి. గురుమూర్తి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి , జిల్లా ఎస్.పి పరమేశ్వర రెడ్డి , గ్రంధాలయ చైర్మన్ మధుబాల లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించి, మెగా చెక్ ను అందించారు.
పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు గా భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం డ్రైవర్ ల కు సంక్షేమ పథకాలు అందించిన దాఖలు లేదని మన ముఖ్యమంత్రి నాలుగు విడతలగా వాహన మిత్ర పథకం ద్వారా రూ. 10 వేలు వంతున అందిస్తున్నారని, వైఎస్సార్ వాహన మిత్ర క్రింద ఇప్పుడు అందిస్తున్న రూ. 261.52 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,025 కోట్లు నేరుగా లబ్ది దారుల ఖాతాకె జమ చేసారని అన్నారు. ఆటో డ్రైవర్ లుగా మీరు పాటశాలలుకు పిల్లలను తీసుకెళ్ళి వస్తుంటారని, మా పిల్లలు కూడా ఇలాంటి డ్రస్ లు వేసుకుని ప్రైవేటు పాటశాలల్లో చదివితే బాగుంటుందని, ఆలోచన మీకు వచ్చి ఉంటుందని ఆ ఆలోచన నిజం చేస్తూ నేడు పేద పిల్లలు కూడా నాణ్యమైన చదువు కోసం నాడు-నేడు తో కార్పొరేట్ పాటశాలల ధీటుగా అభివృద్ధి చేసి, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు, యునిఫారం, సూష్ , బ్యాగు, పుస్తకాలు, డిక్షనరీ వంటివి అందించి దేశవిదేశాలలో పోటీ ప్రప్రంచంలో నిలదోక్కుకునేలా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
గత రెండు సంవత్సరాలలో కోవిడ్ ఉన్న సంక్షేమ పథకాలు ఆపలేదని అన్నారు. మంచి చేసే వ్యక్తిని మనం మరువమని 95శాతం వాగ్దానాలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ననేనని అన్నారు. ప్లినరీ నిర్వహిస్తే జగనన్న కోసం ప్రజలు వర్షం పడుతున్నా లెక్క చేయక 12 కి మీ లు నడిచి వచ్చి మీ అభిమానాన్ని చూపించారని అన్నారు. ఆరోగ్యశ్రీ తో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడం, ఇల్లు లేని పేదలకు ఇంటి పట్టాలు ఇళ్ళ మంజూరు చేసారని అన్నారు.
తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ప్రజల ఇబ్బంది గుర్తించిన మేరకు ఆసరాగా ఉండాలని ప్రతి సంవత్సరము నిర్దేశించిన సమయానికి ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారుల ఖాతాకు జమ చేస్తున్నారని అన్నారు.స్వాతంత్రం వచ్చిన అనంతరం ఎ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ జగన్ మోహన్ రెడ్డి ఏ.పి లో రూ.1,65,000 కోట్లు వివిధ పథకాల ద్వారా లబ్దిదారుల ఖాతాలకు జమ చేసారని అన్నారు. ముఖ్యమంత్రి 2019 సం.నుండి ప్రతి సెక్షన్ వారికి ప్రయోజనాలు కలిగేలా ఆలోచిస్తూ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాహన ఇన్సురెన్స్ మరియు రిపేర్ ఖర్చుల నిమిత్తం ఏడాదికి పదివేల రూపాయల ఆర్థిక సహాయమును అందిస్తున్నారని, మీరు ఇతర ఖర్చులకు వాడకుండా వాహనాలకోసం వాడాలని అన్నారు. తిరుపతి జిల్లా నందు ఇదివరకు లబ్ది పొందిన లబ్ధిదారులు 8803 మరియు కొత్తగా దరఖాస్తులు పరిశీలించిన అనంతరం 2789 మంది అర్హులుగా మొత్తం జిల్లానందు 11598 మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగిందని, రూ.11,59,80,000/- నేడు జమ కానున్నదని అన్నారు.
అనంతరం మెగా చెక్కును పంపిణీ చేసారు, కలెక్టరేట్ లో లబ్దిదారుల ఆటోను మంత్రి స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామిరెడ్డి చేపట్టగా గూడూరు ఆర్ టి ఓ రాంబాబు , మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్లు తిరుపతి- మురళి, కుసుమ, శ్రీకాళహస్తి- శ్రీనివాసులు ,రేణిగుంట – తిమ్మరుసు నాయుడు , సూళ్ళూరు పేట – శేషా రెడ్డి , ఎఒ విజయప్రసాంతి , లబ్దిదారులు పాల్గొన్నారు.