– అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించిన శాడిస్ట్ సునీల్
– అలాంటి వ్యక్తి అంబేద్కరిస్టు ఎలా అవుతాడు?
– సునీల్ కుమార్ పై తన భార్యే ఫిర్యాదు చేసింది.
సునీల్ కుమార్ పై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయకూడదు?
కేంద్రం అరెస్టు చేస్తుందనే భయంతోనే సునీల్ కుమార్ జగన్ రెడ్డి ఊడిగం
-నేరస్డుడైన జగన్ రెడ్డికి కొమ్ముకాస్తున్న సునీల్ కుమార్ కి అంబేద్కరిస్టునని చెప్పుకునే అర్హత ఉందా?
– సునీల్ కుమార్ వ్యవహారశైలితో దళితులు సిగ్గుపడుతున్నారు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
సీఐడీ సంస్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బానిస సంస్ధగా మారిందని, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ తప్పుడు కేసులతో ప్రజల్ని, ప్రతిపక్షాల్ని వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ద్వజమెత్తారు. శనివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. జగన్ రెడ్డికి ఊడిగం చేస్తూ సీఐడీకి ఉన్న ప్రతిష్టతను సునీల్ కుమార్ అప్రదిష్టపాలు చేస్తున్నారు. దళిత ఉద్యోగులెవరైనా అంబేద్కర్ అడుగుల్లో నడుస్తూ సమాజాభివృద్దిక పాటు పడుతూ ప్రజలకు మేలు చేస్తారు. కానీ అంబేద్కర్కిస్ట్టునని చెప్పుకునే సునీల్ కుమార్ నేరస్తుడైన జగన్ రెడ్డికి కొమ్ముకాయటం సిగ్గుచేటు.
సునీల్ కుమార్ వ్యవహారశైలితో దళిత జాతి సిగ్గుపడుతోంది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధించిన శాడిస్ట్ సునీల్. అలాంటి వ్యక్తి అంబేద్కరిస్టు ఎలా అవుతాడు? సునీల్ కుమార్ పై తన భార్యే ఫిర్యాదు చేసింది. అంబేద్కర్ సిధ్దాంతాలు, ఆశయాలంటే దళిత జాతి అభ్యున్నతికి, సమాజాభివృద్దికి పాటుపడాలి. కానీ సునీల్ కుమార్ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారు. అంబేద్కర్ మిషన్ అని పెట్టి ఏమైనా సేవ చేశారా? దాన్ని అడ్డుపెట్టుకుని కుల, మతాల మద్య చిచ్చు పెట్టేలా విద్వేష ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టారు.
అన్ని కులాలు, మతాల్ని ఆదరించిన వ్యక్తి అంబేద్కర్ ఆయన పేరుతో సంస్ధను స్ధాపించి ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిగ్గనిపించటం లేదా? సునీల్ కుమార్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని లీగల్ రైట్స్ అడ్వైరీ సంస్ద కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. అంబేద్కర్ ఇతర మతాల్ని ద్వేషించమని ఏనాడైనా చెప్పారా? ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి, అరాచకాలకు పాల్పడుతున్న సునీల్ కుమార్ పై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయకూడదు?
వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో సుమారు 1000 మందికి పైగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు ఘటనలు జరిగాయి. రాజమండ్రిలో దళిత యువకుడికి శిరోముండనం, చిత్తూరు జిల్లాలో మద్యం మాఫియాని ప్రశ్నించిన ఓం ప్రతాప్ అనుమాస్పద మృతి దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వంటి సంఘటనల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించటం తప్ప బాధితుల పక్షాన ఎందుకు నిలబడలేదు? సోషల్ మీడియా లో కేసులు పెడితే అక్రమ కేసులు పెట్టి హింసిస్తారా? దారపనేని నరేంద్ర, అంకబాబు వంటి వారిపై అక్రమ కేసులు పెట్టి హింసించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టు చేస్తున్న సీఐడీ… కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన సునీల్ కుమార్ పై కేసు ఎందుకు నమోదు చేయకూడదో డీజీపీ, సునీల్ కుమార్ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి.
వైయస్ మృతిపై జగన్ హస్తం ఉందని నాడు కాంగ్రెస్ నేతలు చెప్పారు. దీనిపై విచారణ చేసే నిజాలు తేల్చే దమ్ము సునీల్ కుమార్ కి ఉందా? వివేకా హత్య కేసులో నిందితుల్ని పట్టుకోగలరా? పవన్ చెప్పు తీయటంపై స్పందించిన జగన్ కానీ వివేకా హత్య కేసుపై ఎందుకు స్పందించటం లేదు? తన తండ్రి హత్య వెనుక సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని వివేకానందరెడ్డి కూతురు సునీతా చెప్పింది, దీనిపై సుప్రీం కోర్టు వెళ్లింది, కానీ దీనిపై జగన్ ఎందుకు స్పందించటం లేదు? సునీల్ కుమార్ పిచ్చుకలపై బ్రహ్మాస్ర్తం వేయకుండా వివేకా కేసును చాలెంజ్ గా స్వీకరించి నిందితులెవరో తేల్చొచ్చు కదా. ఆపని ఎందుకు చేయటం లేదు?
దళితులైన అర్జునరావు, కాకి మాధవరావు వంటి ఐఏయస్, ఐపీఎస్ అధికారుల వల్ల దళితులు తలెత్తుకుని తిరిగారు. కానీ నేడు సునీల్ కుమార్ వ్యవహారశైలితో తలదించుకునే పరిస్థితి. తనపై ఉన్న కేసుల్లో కేంద్రం అరెస్టు చేస్తుందనే భయంతోనే సునీల్ కుమార్ జగన్ రెడ్డి ఊడిగం చేస్తూ …ప్రతిపక్షాలతో పాటు, చివరకు దళితులపై కూడా అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు. ఇప్పుడు సునీల్ కుమార్ చేస్తున్న తప్పులకు భవిష్యత్ లో జైలుకెళ్లక తప్పదని పిల్లి మాణిక్యరావు హెచ్చరించారు.