Suryaa.co.in

Andhra Pradesh

సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజే బెంచ్ నిరాకరణ

– విజయ్ సాయి రెడ్డిపై విచారణ కేసు

హైదరాబాద్: వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో సోమవారం ఈ కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటీసులపై విచారణ చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డి విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది.

ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డికి , కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రసాద్ కోరారు.

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వడానికి చీఫ్ జస్టిస్ బెంచ్ నిరాకరించింది. ఐసీఏఐ వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని విజయ్ సాయి రెడ్డి తరుపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE