Suryaa.co.in

Telangana

యువతను చాంపియన్లుగా మలిచిన సీఎం కప్

-సీఎం కప్పు పోటీల నిర్వహణతో గ్రామీణ యువతలో చైతన్యం
-రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్
-క్రీడాకారులకు సమన్నత గౌరవం దక్కింది తెలంగాణ రాష్ట్రంలోనే
-పోటీల విజయవంతనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన డాక్టర్ ఆంజనేయ గౌడ్

గ్రామీణ యువతకు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్)ద్వారా నిర్వహిస్తున్న సీఎం కప్ 2023 రాష్ట్రస్థాయి పోటీలప్రారంభోత్సవ వేడుకలు ఈరోజు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైనాయి. 33 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ తో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలతో క్రీడాకారుల ఆటపాటలతో స్టేడియం దద్దరిల్లిపోయింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ 20 23 యువతను ఛాంపియన్లుగా మలిచిందనిఅన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల మాదిరిగానే క్రీడారంగాన్ని కూడా అభివృద్ధి చేస్తుందని అన్నారు. నగదు ప్రోత్సాహకాల పెంపు క్రీడాకారులకు సమన్నత గౌరవం రెండు శాతం రిజర్వేషన్ వంటి విప్లవత్మకమైన చర్యలతో క్రీడాభివృద్ధిని త్వరితగతిన సాధిస్తుంది అని ఆయన ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రి ఆశీస్సులతో అతి త్వరలోనే నూతన క్రీడా విధానం తీసుకొస్తామని ఇకపై నిరంతరం సీఎం కప్ నిర్వహిస్తామని క్రీడా మైదానాల నిర్మాణం క్రీడా పోటీల నిర్వహణ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తూ దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

సీఎం కప్ 2023ని విజయవంతం చేయడానికి కృషిచేసిన వివిధ శాఖల అధికారులను సిబ్బందిని మంత్రి అభినందించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తులో మరింతగా రాణించాలని మంత్రి సూచించారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఈ పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రారంభోపన్యాసం చేసిన తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ వివిధ ప్రభుత్వ శాఖల సహకారం సమన్వయంతో మండల స్థాయి జిల్లా స్థాయి విజయవంతంగా కొనసాగించిందని అన్నారు.

హైదరాబాద్ నగరంలోని 6 స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని వీరందరికీ స్పోర్ట్స్ అథారిటీ తరఫున సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగానికి ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి క్రీడాకారులను అడుగడుగునా సన్మానం సత్కారాలతో వారి గౌరవాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు

అట్టహాసంగా ఆరంభ వేడుకలు
రేపు సాయంత్రం ఐదు గంటలకు ఎల్. బి . స్టేడియం లో సీఎం కప్ 2023 రాష్ట్రస్థాయి పోటీల వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులుఎస్ మల్లారెడ్డి . క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ,అంజయ్య యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఓ ఎస్ డి డాక్టర్ కే లక్ష్మి , లతోపాటు , అర్జున అవార్డు గ్రహీతలు ములినీ రెడ్డి జేజే శోభ నిఖత్ జరీన్ ఉసాముద్దీన్ .. ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి కార్యదర్శి జగదీష్ యాదవ్ కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జల నగేష్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, అనిల్ కుర్మాచలం, వివిధ క్రీడారంగా వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

33 జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో మార్చ్ ఫస్ట్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సమన్వయంతో అబ్బుర పరిచే విధంగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు ,ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ సంగీతవిభావరి కార్యక్రమము ఎంతగానో అలరించాయి. వివిధ సంస్కృతిక కార్యక్రమాలు మార్చ్ ఫస్ట్ మరియు సంగీత విభావరి కార్యక్రమాలు క్రీడాకారులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

LEAVE A RESPONSE