– బభ్రాజమానం బూతు గోవిందం
– తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేసిన వ్యక్తి ని సలహాదారు గా నియమించుకుంటారా?
– బనకచర్ల ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి
– దేవాదుల ఏ బేసిన్ లో ఉందో కూడా తెలియదు
– బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కేపి వివేకానంద
హైదరాబాద్: నూతన సంవత్సరం బూతు సంవత్సరం లాగా ప్రారంభం అయింది. సీఎం దగ్గర సబ్జెక్ట్ లేదు, సంగతీ లేదు. బభ్రాజమానం బూతు గోవిందం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదుగానీ బూతులు ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ ను ఇష్టానుసారంగా మాట్లాడారు. ఉరి తీయాలి అంటాడు, సలహాలు ఇవ్వాలని అంటాడు. తెలంగాణ ప్రజల నుంచి మీకు పూర్తి స్తాయి వ్యతిరేకత ఉంది.
జూరాల లో ఇవాళ కూడా క్రాప్ హాలిడే ప్రకటించింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో నీటి విడుదల జరుగుతుంది.పక్క రాష్ట్రం తో ఉన్న సమస్యలు తెలంగాణ పట్ల సోయి ఉన్నోళ్లు, అవగాహన ఉన్నవారు సలహాదారు గా ఉండాలి. కానీ ఆదిత్యనాద్ దాస్ సలహాలు తీసుకుని ఏపీకి నీళ్ళు దోచిపెడుతున్నారు. ఆంధ్ర వ్యక్తి గా తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేసిన వ్యక్తి ని సలహాదారు గా నియమించుకుంటారా? ఇప్పటికైనా ఆదిత్యనాద్ దాస్ ను తొలగించి తెలంగాణ వ్యక్తిని నియామించండి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. భేషజాలకు పోకుండా తెలంగాణ వ్యక్తిని నియమించండి. బేసిక్ కూడా మీకు అర్దం కావడం లేదు. ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి కదా? నీటి వాటాల విషయంలో కేసిఆర్ చేసిన కృషి ఫలితం తెలంగాణ వాటా దక్కింది. పాత పాట పాడుతూ రేవంత్ రెడ్డి పాడుతున్నారు. బనకచర్ల ఎక్కడుందో కూడా తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి.
దేవాదుల ఏ బేసిన్ లో ఉందో కూడా తెలియదు. వితండ వాదం చేయకుండా సబ్జెక్ట్ తెలుసుకోండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. పిచ్చి మాటలు మానేసి రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాలి. రేవంత్ రెడ్డికి ఈ ఏడాది మంచి బుద్ధి ఇవ్వాలని, మీ గుణం మారాలి అని కోరుకుంటున్నా.
ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయించి అసెంబ్లీ ప్రారంభం కాకముందే వీడియో రిలీజ్ చేసి డ్రామాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు పై ఇష్టానుసారంగా బయట మాట్లాడుతారు. లోపల డ్రామాలు ఆడుతున్నారు. ఇన్ని రోజుల సభలో ప్రతిపక్షం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
అధికార మదం తో కాంగ్రెస్ పార్టీ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయి. మేము మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు. అడ్డుపడుతున్నారు. కేసీఆర్ గొంతుకై మేము మాట్లాడతాం. తప్పులు సరిదిద్దుకుని పాలన చేయడం చేతకాదు.
బీహార్ వాళ్ళ చేతిలో రాష్ట్రం పెట్టారు అని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడలేద? శాసనసభ జీరో అవర్ తో స్టార్ట్ చేశారు. కొత్త సంప్రదాయం తెరలేపారు. మా పార్టీ తరుపున ఏ అంశం పైనైనా చర్చ కు సిద్ధంగా ఉన్నం.