ప్రజలకు అండగా ఉండాలి…మల్లాది విష్ణు
ప్రజలకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని. …ప్రభుత్వం చేస్తున్న మోసం… నయవంచనను క్లస్టర్ సభ్యులు ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకు వెళ్ళాలని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు.స్ధానిక 26వ డివిజన్ మారుతీనగర్‌లో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం క్లస్టర్–1 సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఆమె డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పధకాలనే పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం తమ పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజలలోకి తీసుకు వెళ్ళాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది గడస్తున్నా ఇంత వరకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. క్లస్టర్ సభ్యులు ప్రజలకు అండగా ఉండటంతో పాటు ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
చంద్రబాబు మేనిఫెస్టో పై ప్రజలకు సమాధానం చెప్పాలి
చంద్రబాబు మేనిఫెస్టోపై ప్రజలకు సమాధానం చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి అభివృద్ది సంక్షేమంను రెండు కళ్ళుగా చేసుకుని పాలన సాగించారని… కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏడాది గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బూటకపు కబుర్లతో నెట్టుకొస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
తొలి అడుగు.. సుపరిపాలన ఫెయిల్యూర్
తాము ఇచ్చిన ప్రతీ హామీలను అమలు చేశామని… అధికారంలో లేకపోయినా తాము ధైర్యంగా ప్రజలలో తిరుగుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం తొలి అడుగు.. సుపరిపాలన ఫెయిల్యూర్ అన్నారు. టీడీపీ నేతలు ప్రజలలోకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారని అన్నారు.
8వేల మందికి ఇళ్ళు మంజూరు చేస్తే క్యాన్సిల్ చేశారు
తాము ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఊదర గొట్టే చంద్రబాబు తమ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో 8వేల మందికి ఇళ్ళు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం ప్రత్యేక జీఓ తెచ్చి క్యాన్సిల్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 8వేల మందికి రెండు సెంట్లు చొప్పున ఇంటిస్ధలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము వారి పక్షానం పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో రౌడీరాజ్యం..
రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడస్తుందని.. అడ్డుకోవాల్సిన పోలీసులు అధికారపార్టీకి అండగా కొమ్ము కాస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంతో పాటు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్ కుక్కల అనిత, శర్వాణీ మూర్తి, యర్లగొర్ల శ్రీరాములు, వైఎస్సార్సీపీ క్లస్టర్–1 అధ్యక్షులు పిల్లుట్ల వంశీ,క్లస్టర్ సభ్యులు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం త్రివేణి రెడ్డి, సెంట్రల్ నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు తోపుల వరలక్ష్మి, వైఎస్సార్సీపీ పలు విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.