– తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి
విశాఖపట్నం: తమ కూటమి సంక్షేమ, అభివృద్ధి పాలన పట్ల విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆనందం వ్యక్తం చేశారు.
సుపరిపాలనలో తొలి అడుగు అని టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని 28వ వార్డులో ఊటగెడ్డలో పర్యటించి ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసు కున్నారు.
ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసు కుంటున్నా మన్నారు. ఎన్నికల ముందు తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే చాలా వరకు సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, మిగిలినవి కూడా అతి త్వరలో పూర్తిగా అమలు చేస్తా మన్నారు.
సోషల్ ఇంజనీరింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమం సమర్ధవంతంగా అందించడమే అతని లక్ష్య మన్నారు.ఈ కార్యక్రమంలో 28వ వార్డు టీడీపీ అధ్యక్షులు నక్క కనకరాజు, ఊరుకుటి పైడిరాజు,పోలిపల్లి సురేష్,పళ్ళు శ్రీను,కనక మహాలక్ష్మి, మంగమ్మ, డొక్కరి శ్రీను తెలుగుదేశం కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు.