ఒక్క కాంట్రాక్టర్ మరణం బీజేపీ ప్రభుత్వ పతనానికి కారణం అయింది అంటే నమ్ముతారా ? అవును నిజం. బెల్గావికి చెందిన కాంట్రాక్టర్ మృత దేహం రోడ్ పక్కన దొరికింది. రోడ్ వర్క్ లు చేసే కాంట్రాక్టర్ అతను తాను చేసిన రోడ్ వర్క్ కి బిల్లుల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు నాలుగు కోట్లు పైగా బిల్లులు స్థానిక పంచాయతీరాజ్ మంత్రి ఆపేశాడు. ఆ మంత్రి మీద బిజెపి ఐ కమాండ్కు సీబీఐకి రాష్ట్ర ముఖ్యమంత్రి కి కాంట్రాక్టర్ అసోసియేషన్ లకు అనేక మందికి ఫిర్యాదు చేశాడు.
ఆ స్థానిక మంత్రి 40 శాతం కమీషన్ అడుగుతున్నాడు అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి ఇవ్వాలి ఆని అతను ఆ ఫిర్యాదులు తెలిపాడు .ఎంతకీ స్పందన లేకపోతే చనిపోయే ముందు తన మిత్రులకు అందరికీ తన మరణానికి ఆ మంత్రి కారణం అని మేసేజి లు పంపి చనిపోయాడు. వెంటనే కాంగ్రెస్ దాన్ని పుచ్చుకొని 40% సర్కార్ అనే స్లోగన్ తీసుకుంది.. ఫార్టీ పర్సెంట్ సర్కార స్లోగన్ బిజెపిని ముంచేసింది