– భూములిచ్చిన వారిలో 85 శాతం 2-5 ఎకరాల్లోపు చిన్న రైతులే
– భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లను ఇవ్వని ప్రభుత్వం
– తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిలు దొంతిరెడ్డి వేమారెడ్డి
మంగళగిరి : కూటమి ప్రభుత్వ తీరుతో రాజధాని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన వారిలో 85 శాతం మంది 2-5 ఎకరాల్లోపు చిన్న రైతులకు… భూములకు బదులు రిటర్నబుల్ ప్లాట్లను ఇవ్వకుండా.రైతులకిచ్చిన ఏ హామీని సీఎం చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… 18 నెలల్లో 2.50 లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం రాజధానితో సహా దేనికి ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నమ్మి భూములిచ్చిన రైతులను నిలువునా మోసం చేసిన చంద్రబాబు , రైతులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కూటమి ప్రభుత్వ తీరుపై మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి డైమండ్ బాబు తీవ్రంగా ఆక్షేపించారు. 18 నెలలుగా రాజధాని భూముల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయకుండా.. మరలా మరో 40 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ఎలా సిద్ధమవుతారని నిలదీశారు.రైతులు వాస్తవాలు తెలుసుకుని రోడ్డెక్కడం ఖాయమని మండిపడ్డారు. దాదాపు 30 వేల మందికి పైగా చిన్న, సన్నకారు రైతులు రాజధాని కోసం భూములిచ్చారు. దాదాపు 85 శాతం మంది 2 నుంచి 5 ఎకరాల లోపు రైతులు ఉంటే… మరో 10 శాతం మంది 5 ఎకరాల పైబడిన వారు, 10 ఎకరాలున్నవారు మరో 5 శాతం మంది ఉన్నారు.
కేవలం సాగుమీద మాత్రమే ఆధారపడి తక్కువ కమతాలున్న రైతులు దాదాపు 12 ఏళ్లుగా… భూములు కోల్పోయి ఏ పనీ లేకుండా అయిపోయారు. ప్రభుత్వం సాయం చేస్తున్నా… దాన్ని తింటూ కూర్చోవడం 2015 ప్రాంతంలో ఆ రోజు ప్రభుత్వం కేవలం మూడేళ్లలోనే మీకు రావాల్సిన భూమిని అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పారు. మౌలికసదుపాయాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు కాగితాల మీద తప్ప మీ మాటలేవీ వాస్తవం రూపం దాల్చలేదు. ఇది చాలదన్నట్టు ప్రభుత్వం మరలా కొత్తగా మరో 40వేల ఎకరాలు సేకరించి… దేశంలో ఎక్కడా లేని విధంగా రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు కట్టబోతున్నారని తెలిసింది.
చంద్రబాబు నాయుడు గారూ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా పేద, చిన్న సన్నకారు రైతులను బ్రతకనివ్వండి. దాదాపు 12 ఏళ్ల జీవిత కాలంలో మీరు వాళ్లకిస్తామన్న పదో, పన్నెండో, ఇరవై సెంట్లో మాకు ఇస్తే.. దానిలో ఏదో ఒకటి జీవనోపాధి కోసం పండించుకుంటాం. రైతులు దాదాపు 12 ఏళ్ల వ్యవధిలో పిల్లల చదువులు కోసం కూడా బ్యాంకులో పెట్టుకుని రుణాలు తీసుకునే అవకాశం లేదు. ఫిజికల్ గా పేపర్లు లేకపోవడంతో బ్యాంకులు రుణాలకు అంగీకరించడం లేదు. ఇరవై ఎకరాలున్న ఓ పెద్ద రైతు రాజధాని కోసం 20 ఎకరాలిస్తే… బదులుగా మీరు 1 ఎకరా ఆయనకు కేటాయించారు. అక్కడి వెళితే అది నా భూమి అని వేరేవాళ్లు చెబుతున్నపరిస్థితి.
ఇలాంటి చాలా సమస్యలున్నాయి. రైతులు సమస్యల గురించి నోరెత్తితే సమాధానం చెప్పేవాళ్లు లేరు. సీఆర్డీఏ ఆఫీసులో స్పందన లేదు. మంత్రి నారాయణ నెల, రెండు నెలల్లో మాకిస్తామన్న సైట్స్ ఇప్పిస్తామని చెప్పడం తప్ప వాస్తవంలో అది జరగడం లేదు. మాకు కేటాయిస్తామన్న చోట కనీసం పిచ్చిమొక్కలు కూడా తొలగించని పరిస్థితి ఉంది. ఎప్పుడు ఇవ్వబోతున్నారు? రాజధాని ప్రాంత రైతులను బ్రతికించండి. రైతులను బ్రతికించిన తర్వాత మీరు ఎన్ని చేసినా పద్ధతిగా ఉంటుంది. రైతులు జీవితాలు మీ నిర్ణయాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి త్వరగా రైతుల సమస్యలను పరిష్కరించమని కోరుకుంటున్నాం. రాజధాని ప్రాంత రైతులకు మీరు మాటిస్తూ…. మంచి కాలేజీ కట్టిస్తాను. ఉచిత విద్య, వైద్య, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామన్న మీ మాటలను నూటికి నూరుశాతం నమ్మాం. వీలైనంత త్వరగా మా బ్రతుకుల్లో మార్పు వచ్చేలా.. మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్లు మూడు నెలల్లో మాకు సైట్లు ఇవ్వండి. ఇది రైతుల ఆవేదన.