టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వచ్చే ఏడాది జనవరి 1 కల్లా రోడ్లపై ఒక్క గుంత కనపడకూడదంటూ మూడేళ్లుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ప్రతీ ఏటా ఇచ్చే స్టేట్మెంట్లో ఒక్క అక్షరమూ మారలేదు. రోడ్ల దుస్థితీ మారలేదు. ఇలా బురదలో పొర్లుదండాలు పెడుతూ తమ గ్రామానికి రోడ్డు వేయాలని విన్నవిస్తున్నది సీఎం
జగన్రెడ్డి గారి సొంత కడప జిల్లా, బి మఠం మండలం, కొత్తబసవాపురం సోమిరెడ్డిపల్లి పంచాయతీ వార్డు సభ్యుడు. ఇది ప్రభుత్వంపై బురద చల్లే కుట్ర అని సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి బురదని ఫోరెన్సిక్కి పంపి, పొర్లుదండాలు మార్ఫింగ్ అని ప్రెస్మీట్ పెట్టొద్దు ప్లీజ్. అన్నింటికీ బటన్ నొక్కుతున్న సీఎం గారూ దరిద్రపు రోడ్లు బాగు అయ్యేలా ఒకసారి బటన్ నొక్కితే గ్రామస్తులకి ఈ బురదలో పొర్లుదండాలు పెట్టే బాధ ఉండదు. నిరసన తెలిపేవారిపై తప్పుడుకేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయాల్సిన టాస్క్ సీఐడీకి తప్పుతుంది.