Suryaa.co.in

Andhra Pradesh

నవంబర్ నెలాఖరుకల్లా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల్ని పూర్తి చేయాలి

జిల్లాల కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు ఆదేశాలు

మంగళగిరి ఎపిఐఐసి బిల్డింగ్ లో శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కృష్ణ బాబు. భవనాల నిర్మాణానికి సంబంధించి క్షేత్ర స్థాయి సమాచారాన్ని తీసుకోవాలని డిఎంహెచ్వోలకు ఆదేశం. ఎంఎల్ హెచ్ పీల ద్వారా క్షేత్ర స్థాయి సమాచారాన్ని డిఎంహెచ్వోలు తెప్పించుకోవాలి.

వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాల్లో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు. సకాలంలో భవనాల్ని పూర్తి చేయలేని కాంట్రాక్టర్లను తొలగించండి. కొత్త ఏజెన్సీలకు అప్పజెప్పి నిర్మాణాల్ని పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్లకు కృష్ణ బాబు ఆదేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు నెలాఖరు కల్లా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణాలను పూర్తి చేయాల్నిందే. కాంట్రాక్టర్లకు ప్రతినెలా బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాం. భవనాల నిర్మాణాల ప్రగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్ లు పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పిహెచ్ సీల భవనాల్ని కూడా నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన విషయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి వెనుకాడడం లేదు. కొత్త జిల్లాల డిఎంహెచ్వోల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు.

కార్యాలయాల ఏర్పాటుకు తక్షణం ప్రతిపాదనలు పంపండి
వెనువెంటనే నిధుల్ని సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ జిల్లాలో నూ కార్యాలయాలు, మౌలిక సదుపాయాల లేమితో డిఎంహెచ్వోలు ఇబ్బంది పడకూడదు. మౌలిక సదుపాయాల కల్పనకు సిఎం సుముఖంగా ఉన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. సీజనల్ వ్యాధుల ప్రబలే హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిఎంహెచ్వోలు ఆరోగ్య శ్రీ డిసిలతో సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధుల్ని అరికట్టాలి. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలోనే ఫీవర్ సర్వేపై మరింత శ్రద్ధ పెట్టాలి. కొవిడ్ వ్యాక్సిన్ ప్రికాషనరీ డోస్ ప్రక్రియను వేగవంతం చేయాలి.

LEAVE A RESPONSE