Suryaa.co.in

Andhra Pradesh National

దేశం సిగ్గుపడుతోంది!

మణిపూర్ మహిళల ఘటనపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనకు దేశం సిగ్గుపడుతోందని, కేంద్రం సిగ్గుపడుతుందో, లేదో తెలియదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అన్నారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మే 4 తేదీన సంఘటన జరిగితే, మే 18 వ తేదీన జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దుండగులను అరెస్టు చేయలేదన్న ఆరోపణలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సిగ్గులేని చర్యలను అదుపు చేయలేకపోతే ప్రపంచ దేశాల ముందు దేశం సిగ్గు పోతుందని చెప్పారు.

గత కొన్ని నెలలుగా మాణిపూర్ తగలబడుతుంటే , ప్రధాని మోడీ మౌనవ్రతం వీడలేదన్నారు. మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిజే సుమోటుగా స్పందించటం పట్ల హర్షం వ్యక్తంచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో దళితుల మీద, గిరిజనుల మీద దాష్టీకాలు జరుగుతున్నా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

ఇటీవల యూపీలో దళిత యువకుడి చేత మూత్రం త్రాగించారని, రాజస్థాన్ లో దళిత యువకుడి తలపై మూత్రం పోశారని, ఏపీలో గిరిజన యువకుడిని చావబాది, నోట్లో మూత్రం పోశారని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని, గిరిజన సంఘటనకు కూడా కుల ముద్ర వేసి వైకాపా నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

LEAVE A RESPONSE