– వచ్చే జమానా ఆడబిడ్డలదే
– సగం సీట్లు ఆడబిడ్డలకే వస్తాయి
– లీడర్ శిక్షణా ముగింపు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: లీడర్ శిక్షణా తరగతులు ప్రతి జిల్లాలో పెట్టుకుంటాము. ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్ కేవలం ట్రయల్ మాత్రమే. పదిమందిని లీడ్ చేయాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ఉండాలి. తెలంగాణ జాగృతి బిడ్డలు ఎంతదూరం అయినా వెళ్తారు
జీడీపీతో పాటు పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం ఎంత ఉంది,స్వేచ్ఛ ఎంత ఉంది? నేడు రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే జైల్లో పెడుతున్నారు.రాష్ట్రంలో పిరికి ముఖ్యమంత్రి ఉన్నారు. సక్సెస్ కు ఒక్క హార్డ్ వర్క్ మాత్రమే.
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసివేస్తే మేధావులు మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ జాగృతి బాధ్యత తీసుకుంది.బనకచర్లపై మేధావులు మాట్లాడటంలేదు. మేధావులు ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మన నీళ్లు ఏపీకి వెళ్తే మేధావులు ఎక్కడినుంచి తెలంగాణకు నీళ్లు తెస్తారు? సోషల్ మీడియాను పాజిటివ్ గా వాడాలి.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీరు నిటారుగా నిలబడండి. మీ వెనుక నేను ఉన్నా. ఎవరు ఏమంటారో చూసుకుంటా. అసలు భయపడేది లేదు. వచ్చే జమానా ఆడబిడ్డలదే సగం సీట్లు ఆడబిడ్డలకే వస్తాయి. అన్న,దమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మహిళ బిల్లు కోసం కొట్లాడిన సంస్థగా మహిళలను నాయకులుగా చేయాల్సిన బాధ్యత తెలంగాణ జాగృతికి ఉంది.